ETV Bharat / state

Daily Essentials Price Hike Telangana : అమ్మ బాబోయ్.. పెరిగిన నిత్యావసరాలు.. ఇక కొనలేం.. తినలేం..? - Rice Price in Telangana

Daily Essentials Price Hike Telangana : నిత్యావసర ధరలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ధరల పెరుగుదల సామాన్యుడిని ఒత్తిడికి గురిచేస్తున్నాయి. మనసారా వంట చేసుకుని తినే పరిస్థితులు లేకుండా చేస్తున్నాయి. ధరలు చూస్తుంటే.. తినాలన్న ఆశ చచ్చిపోతోందని మధ్యతరగతి ప్రజలు వాపోతున్నారు. నిన్న టమాట .. ఇప్పుడు నిత్యావసరాలు.. ఇలా ధరలు పెరిగిపోతుంటే తినేదెలా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Kandipapu 1 KG Price in Telangana
Rice Prices Hike
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 4, 2023, 10:31 AM IST

Daily Essentials Price Hike Telangana : ఇటీవల టమాట ధరలు.. ఆ తర్వాత మిర్చి, ఉల్లి ధరలు ఆకాశాన్ని అంటాయి. ఇప్పుడిప్పుడే కాస్త తగ్గుముఖం పడుతున్నాయని ఆనందపడే లోపే నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోతున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న నిత్యావసర ధరలను చూసి సామాన్యుడు బెంబేలెత్తిపోతున్నాడు. ఇలా ధరలు పెరుగుతూనే ఉంటే మూడు పూటల భోజనం చేసేదెలా అంటూ ఆందోళన చెందుతున్నారు. నిత్యావసరాల ధరలు పెరిగేందుకు వాతావరణంలో వచ్చిన మార్పులే కారణం అని వర్తకులు అభిప్రాయపడుతున్నారు.

Kandipappu Price Hike Telangana : తెలుగు రెండు రాష్ట్రాల్లో ప్రోటీన్స్​ సమృద్ధిగా లభించే కందిపప్పు(Kandipappu Price Today)ను నిత్యం వాడుతుంటారు. దీని కిలో ఆరు మాసల్లోనే సుమారు 50 శాతం పెరిగింది. ఫిబ్రవరిలో రూ.110- 120 ఉన్నది.. ప్రస్తుతం రూ.170కి చేరుకుంది. మహారాష్ట్రలో ఎక్కువగా వర్షాలు లేక దిగుబడి తగ్గింది. దీంతో అక్కడి నుంచి దిగుమతి చేసుకుంటున్న తెలంగాణ రాష్ట్రంలో ధరలు పెరుగుతున్నాయని సామాన్యులు వాపోతున్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా ఎర్రపప్పు, పెసరలను వాడుతున్నారు. మినపప్పు కిలో ధర రూ.110 నుంచి నెల రోజుల్లోనే రూ.130కి పెరిగింది.

Vegetables Price Hike in Telangana : కూరగాయలు ధరలు తగ్గాలంటే.. ఇలా చేయాల్సిందే!

Milk Price Hike Telangana : కూర వండినప్పుడు పోపు చేయాలంటే మొదటిగా గుర్తుకు వచ్చేది జీలకర్ర.. అలాంటిది ప్రస్తుత రోజుల్లో జీలకర్ర లేకుండానే మధ్యతరగతి కుటుంబాలు కర్రీ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం జీలకర్ర కిలో రూ. 700కి పైగా ఉంది. ఈ సంవత్సరం మొదటిలో రూ.300లోపే ఉండేది. శనగపప్పు రూ.65 నుంచి రూ.75-80కి పెరిగింది. చింతపండు ధర కిలో రూ.120 నుంచి రూ. 150కి పెరిగింది. పాలు లీటర్​కి రూ.5 చొప్పున పెరిగింది. నాణ్యమైనవైతే రూ.80 నుంచి రూ.100 వరకు తీసుకుంటున్నారు. అల్లం, వెల్లుల్లి, వంట నూనెలు ధరలు సామాన్యులకి అందుబాటులోనే ఉన్నాయి.

ఇప్పుడిక 'బియ్యం' వంతు.. కొనలేం.. తినలేం..

Rice Price in Telangana : భోజనం చేయాలంటే ముఖ్యంగా అవసరమైనది బియ్యం. వాటి ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. బియ్యంలో దొరికే రకాలకు అనుగుణంగా వాటి ధరలు నిర్ణయిస్తున్నారు. సన్న బియ్యం 25 కిలోల బస్తా రూ. 1,250 నుంచి రూ.1,500 అయింది. నాణ్యమైన రైస్​ అయితే కిలో రూ.54 నుంచి రూ.64కి చేరింది. విదేశాలకు సన్నబియ్యం ఎగుమతులపై నిషేధం విధించకపోతే బియ్యం(Rice Bag) ధరలు మరింత పెరిగేవని వ్యాపారులు చెబుతున్నారు. వేసవి కాలంలో పడిన అకాల వర్షాలతో పంట నష్టం తీవ్రంగా జరిగిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. అన్నదాతలు దొడ్డు రకం వరి సాగుకే ప్రాధాన్యం ఇవ్వడం.. ఇలాంటి అంశాలు ధరలు పెరుగుదలకి కారణాలుగా కనిపిస్తున్నాయి.

గత ఆరు నెలల్లో నిత్యవసర ధరలు పెరుగుదల :

క్రమ సంఖ్యపదార్ధం(1kg)పాత ధర(రూపాయిల్లో)కొత్త ధర(రూపాయిల్లో)
1కందిపప్పు110170
2మినపప్పు110130
3జీలకర్ర 300700
4చింతపండు120150
5బియ్యం(25కిలోలు)12001500
6పాలు లీటరుకు రూ.5 చొప్పున పెరిగిన రేటు

Tomato Prices More High : టమాట రికార్డుల మీద రికార్డులు.. భైంసాలో కిలో@200

Subsidy Tomatoes in AP అక్కడ టమాట కిలో రూ.50 లే..! రైతు బజారుకు క్యూ కట్టిన జనాలు..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.