Cyberabad CP precautions to Passengers: సంక్రాంతి పండుగ నేపథ్యంలో భాగ్యనగరంలో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో రద్దీ ఏర్పడింది. ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్, ఎల్పీనగర్, బీహెచ్ఈఎల్, కూకట్పల్లి ప్రాంతాల్లో ప్రయాణికులు కిటకిటలాడుతున్నారు. సొంతూళ్లకు వెళ్లేందుకు ప్రయాణికులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు భారీగా చేరుకుంటున్నారు. ఈ క్రమంలో ఇళ్లకు తాళాలు వేసి సొంత ఊళ్లకు పయనమవుతున్న వారికి సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర పలు సూచనలు జారీ చేశారు. ఇలాంటి సమయాల్లో దొంగతనాలకు ఆస్కారం ఉందన్న సీపీ.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ మేరకు వారికి పలు జాగ్రత్తలు, సూచనలు చెప్పారు.
సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లేవారికి సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర సూచనలు | |
1. | కొత్తవారి కదలికలపై పోలీసులకు సమాచారం అందించాలి |
2. | కాలనీలు, ఇంటి పరిసరాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి |
3. | బైక్‌లు, కార్లను ఇళ్ల ఆవరణలోనే పార్కింగ్ చేయాలి |
4. | విలువైన వస్తువులను బైక్‌లు, కార్లలో పెట్టొద్దు |
5. | ఇంట్లో ఏదో ఒక గదిలో లైటు వేసి ఉంచాలి |
6. | పేపరు, పాలవారిని రావద్దని చెప్పాలి |
7. | టైమర్‌తో కూడిన లైట్లను ఇంట్లో అమర్చుకోవాలి |
8. | ప్రయాణం చేస్తున్నప్పుడు బ్యాగులు దగ్గరే పెట్టుకోవాలి |
9. | ఇంటి డోర్‌కు సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవాలి |
10. | ప్రజలు తమ ప్రాంతాల్లో గస్తీ ఏర్పాటుకు సహకరించాలి |
11. | పోలీస్‌స్టేషన్, బీట్ కానిస్టేబుల్ నంబర్లు దగ్గర పెట్టుకోవాలి |
12. | ప్రజలు, పోలీసుల సమన్వయంతో చోరీల నియంత్రణ సులభం |
13. | నమ్మకమైన సెక్యూరిటీ, వాచ్‌మెన్‌ను నియమించుకోవాలి |
14. | బంగారు నగలు, నగదు బ్యాంకు లాకర్లలో పెట్టుకోవాలి |
ఇదీ చదవండి: ఊరెళ్తున్న భాగ్యనగరం.. హైదరాబాద్-విజయవాడ హైవేపై రద్దీ