హైదరాబాద్‌లో వరదలపై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వదంతులను నమ్మవద్దని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ప్రజలను కోరారు. సైబరాబాద్ పరిధిలో ఇప్పటి వరకూ ముంపునకు గురైన మైలార్‌దేవ్‌పల్లిలోని పలు కాలనీలలో... సహయక చర్యలు చేపట్టామని సీపీ తెలిపారు.
రాజేంద్రనగర్ అప్ప చెరువుకు గండి పడి కొట్టుకుపోయిన శంషాబాద్ జాతీయ రహదారిని... అధికారుల సాయంతో రెండ్రోజుల్లో అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. ఇళ్లు నీటమునిగి సర్వస్వం కోల్పోయిన వారికి సోసైటీ ఫర్ సైబర్ సెక్యూరిటీ కౌన్సిల‌్‌తో పాటు పలు స్వచ్చంద సంస్థల సహకారంతో ఆహారాన్ని అందిస్తున్నామంటున్న సజ్జనార్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి.
ఇదీ చూడండి: హైదరాబాద్ వరద సహాయక చర్యలపై మంత్రి కేటీఆర్ సమీక్ష