ETV Bharat / state

ఫేస్​బుక్​లో ప్రేమ అంది... కాపాడాలంటూ... - చాటింగ్​ చేసి చీటింగ్

ఫేస్​బుక్​ నుంచి వాట్సాప్​ వరకు ప్రేమతో దగ్గరైంది. నీకోసం భారత్​కు వస్తున్నానని నమ్మబలికింది. 'దిల్లీ ఎయిర్​పోర్టులో ఉన్నాను... నా బ్యాగ్​ కస్టమ్స్ అధికారుల వద్ద ఉంది. వెంటనే విడిపించు' అంటూ మోసం చేసింది.

cyber-lady-cheating-hyderabad-men
ఫేస్​బుక్​లో ప్రేమ అంది... కాపాడాలంటూ మోసం చేసింది...
author img

By

Published : May 27, 2020, 2:08 PM IST

మలక్​పేటకు చెందిన సయ్యద్ అహ్మద్​కు ఓ సైబర్​ లేడి ఫేస్​బుక్​లో ఫ్రెండ్ రిక్వస్ట్ పెట్టింది. విదేశాల్లో ఉంటానని పరిచయం చేసుకుంది. ప్రేమ పేరుతో చాటింగ్ చేస్తూ... వాట్సాప్ వరకు వచ్చేసింది. త్వరలోనే భారత్​కు వస్తున్నానని మెసేజ్​ చేసింది.

వారం క్రితం ఇండియాకు వచ్చానని... దిల్లీ ఎయిర్ పోర్ట్​లో ఉన్నానని... తనతో తెచ్చుకున్న బ్యాగ్​ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారని తెలిపింది. తనను విడిపించాలని ప్రాధేయపడింది. తన దగ్గరున్న కరెన్సీకి కస్టమ్ ఛార్జ్, ఇన్​కమ్ టాక్స్ ఛార్జ్​ పేరుతో లక్షా 26 వేల నగదు కావాలంటూ నమ్మబలికింది. నమ్మిన సయ్యద్ ఆమెకు డబ్బును ఆన్​లైన్​ ద్వారా పంపాడు. అనంతరం ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ రావడంతో మోసపోయానని తెలుసుకుని... సైబర్​ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఇవీ చూడండి: తెలంగాణపై కరోనా పంజా... పెరుగుతున్న కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.