ETV Bharat / state

రెచ్చిపోతున్న సైబర్​ నేరగాళ్లు... ప్రమేయం లేకుండానే ఖాళీ అవుతున్న ఖాతాలు - hyderabad news

బ్యాంకుకు పోలేదు. ఏటీఎంకూ వెళ్లలేదు. ఫోన్​కు ఏలాంటి ఓటీపీ రాలేదు. కానీ... బ్యాంక్ ఖాతా మాత్రం ఖాళీ అవుతోంది. మరో వైపు ఓఎల్​ఎక్స్​లో వస్తువులు పెట్టి.. నచ్చి డబ్బులు పంపించిన తర్వాత ఫోన్​ నంబర్లు పనిచేయవు. ఇలా వివిధ రకాల పద్ధతుల్లో సైబర్​ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. దొరికినంతా దోచుకుంటూ ఖాతాలు ఖాళీ చేస్తున్నారు.

cyber fraud cases registered in hyderabad

author img

By

Published : Jul 11, 2020, 8:48 PM IST

హైదరాబాద్​లో సైబర్​ నేరగాళ్లు తమ చేతివాటం చూపిస్తున్నారు. వివిధ పద్ధతుల్లో అందినకాడికి దోచుకుంటూ... ఖాతాలు ఖాళీలు చేస్తున్నారు. హైదరాబాద్​లోని వివిధ ప్రాంతాలకు చెందిన ముగ్గురు బాధితుల నుంచి సైబర్​ మోసగాళ్లు డబ్బులు దోచుకున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయి.

ఓఎల్​ఎక్స్​లో బండి పెట్టి...

మారేడ్​పల్లికి చెందిన జయవధన్​కు పుట్టినరోజు కానుకగా బుల్లెట్​ వాహనం కొనివ్వాలని తలచిన అతని తల్లి... ఓఎల్ఎక్స్​ను ఆశ్రయిచింది. అందులో ఒక వాహనం నచ్చి బేరమాడింది. ఆర్మీ అధికారిగా పరిచయం చేసుకున్న ఆ మోసగాడు... రూ.75వేలకు ఇస్తానని ఒప్పుకున్నాడు. ఆన్​లైన్​లో డబ్బు చెల్లించాలని తెలపగా... మొత్తం నగదును బాధితురాలు పంపింది. ఆ తర్వాత క్షణాల్లోనే సెల్ నంబర్ ఆపేసినట్లు రాగా... వెంటనే సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ప్రమేయం లేకుండా ఖాతా ఖాళీ...

తాను బ్యాంకుకు వెళ్లలేదు. ఏటీఎంకు వెళ్లలేదు. ఫోన్​కు ఏలాంటి ఓటీపీ రాలేదు. కానీ... బ్యాంక్ ఖాతా నుంచి రూ.41వేలు డ్రా అయ్యాయని మెహిదీపట్నానికి చెందిన రాజేశ్ భుజంగ్ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. అలాగే... కాచిగూడకు చెందిన సునీతా రాఘవన్... తన బ్యాంక్ ఖాతాల్లోంచి డబ్బులు మాయమవుతున్నాయని గ్రహించింది. వెంటనే బ్యాంకుకు వెళ్లి ఆరా తీయగా.. రూ. 60వేలు డ్రా అయినట్లు తెలిసింది. తన ప్రమేయం లేకుండానే ఖాతాలోని డబ్బులు మాయమవుతున్నాయని బాధితురాలు సైబర్ క్రైం పోలీసులుకు ఫిర్యాదు చేసింది. ఈ మూడు ఘటనలపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చూడండి: మీ ఇంటికే కరోనా కిట్.. హోం ఐసొలేషన్ బాధితులకు మాత్రమే..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.