హైదరాబాద్ నారాయణగూడలోని ఒక మహిళా కళాశాలలో పనిచేసే ఓ అధ్యాపకురాలికి ప్రిన్సిపాల్ పంపించినట్లు ఒక మెయిల్ వచ్చింది. తనకు అత్యవసరంగా డబ్బులు కావాలని... వెంటనే అమెజాన్‌లో 25 వేల బహుమతుల కూపన్లు (గిఫ్ట్ ఓచర్లు) కొని పంపించాలని ఈ మెసేజ్ సారాంశం. వెంటనే గిఫ్ట్ ఓచర్లు కొని పంపించింది.
తర్వాత మరో 30వేల విలువ చేసే గిఫ్ట్ ఓచర్లు పంపించాలని ఇంకో మెయిల్ వచ్చింది. ఆమెకు అనుమానం వచ్చి వెంటనే ప్రిన్సిపాల్‌కు ఫోన్ చేసి ఆరా తీసింది. ఇదంతా మోసమని.. తాను ఎవరికీ మెయిల్ పంపించలేదని తెలిపారు. ఆమె షాక్‌కు గురైంది. వెంటనే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.