ETV Bharat / state

ఫేస్​బుక్ అకౌంట్​ హ్యాక్ చేసి రూ.లక్ష దోచిన సైబర్ నేరగాళ్లు

హైదరాబాద్​లో ఆర్థిక నేరగాళ్లు విజృంభిస్తున్నారు. ఇటీవలే జరిగిన రెండు ఆర్థిక మోసాలు మరువకముందే తాజాగా ఆర్మీ జవాన్​ను బురిడీ కొట్టించి స్నేహితుడి పేరుతో రూ.లక్ష దోచారు.

author img

By

Published : May 4, 2020, 11:28 PM IST

రూ.లక్ష దోచిన ఆర్థక నేరగాళ్లు
రూ.లక్ష దోచిన ఆర్థక నేరగాళ్లు

ఫేస్​బుక్ అకౌంట్ హ్యాక్​ చేసిన సైబర్ నేరగాళ్లు ఓ వ్యక్తి వద్ద నుంచి లక్ష రూపాయలు దోచేశారు. తాను ఇబ్బందుల్లో ఉన్నానని వెంటనే లక్ష రూపాయలు అకౌంట్​లో జమ చేయాలని తన స్నేహితుడు ఆర్మీ జవాన్ రాములుకి మెసేజ్ పెట్టారు. వెంటనే ఆ అకౌంట్​కి లక్ష రూపాయలను ఆర్మీ జవాన్ బదిలీ చేశారు.

డబ్బులు అకౌంట్​లో వేశానని తన స్నేహితుడికి జవాన్ కాల్ చేసి చెప్పారు. తాను డబ్బులు అడగలేదని స్నేహితుడు జవాన్​కు బదులిచ్చారు. కంగుతిన్న జవాన్ తన స్నేహితుడితో కలిసి ఫేస్​బుక్ అకౌంట్ హ్యాక్ అయిందని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చూడండి : 'వలస కూలీల ప్రయాణ ఖర్చులు ప్రభుత్వమే భరించాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.