రాష్ట్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా గోదాముల నిర్మాణాలకు చర్యలు వేగవంతం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ అధికారులకు సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు గోదాముల నిర్మాణాలకు సంబంధించి హైదరాబాద్ బీఆర్కే భవన్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు.
రాష్ట్రంలో గోదాముల నిల్వ సామర్థ్యం, ఈ ఏడాది వానకాలంలో రాబోయే ధాన్యం, ఇతర వ్యవసాయోత్పత్తుల డిమాండ్, దిగుబడులు తదితర అంశాలపై చర్చించారు. గిడ్డంగుల నిర్మాణాలకు సంబంధించి భూమి సేకరణ, ఇతర సమస్యలపై జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకోవాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, రాష్ట్ర సహకార బ్యాంకు ఛైర్మన్ కొండూరి రవీందర్‌రావు, ఎండీ మురళీధర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.