ETV Bharat / state

CS Review On Vacciation: ప్రత్యేక బృందాలతో వ్యాక్సినేషన్ వేగవంతం: సీఎస్ - వాక్సినేషన్​ ప్రక్రియ

రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, మున్సిపల్ వార్డుల్లో వాక్సినేషన్​ ప్రక్రియను మరింత వేగవంతం సీఎస్ సోమేశ్​ కుమార్ (CS SOMESH KUMAR) అధికారులను ఆదేశించారు. ఇందుకోసం గ్రామ , వార్డు స్థాయిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లా కలెక్టర్లు, వివిధ శాఖల కార్యదర్శులు, వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు.

CS somesh kumar review
వాక్సినేషన్​ ప్రక్రియ మరింత వేగవంతం చేయాలన్న సీఎస్
author img

By

Published : Oct 27, 2021, 5:15 AM IST

రాష్ట్రంలో వంద శాతం వ్యాక్సినేషన్‌ లక్ష్యాన్ని సాధించేందుకు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పని చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS SOMESH KUMAR) సోమేశ్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఇప్పటికే 3 కోట్ల కొవిడ్‌ డోసులను పంపిణీ చేసినట్లు సీఎస్‌ చెప్పారు. రాష్ట్రంలో కరోనా వాక్సినేషన్‌పై జిల్లా కలెక్టర్లు, వివిధ శాఖల కార్యదర్శులు, వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులతో దృశ్య మాధ్యమ సమీక్ష నిర్వహించారు.

బ్రిటన్, రష్యా, ఉక్రెయిన్, బ్రెజిల్, జర్మనీ, నెదర్లాండ్స్, చైనా.. తదితర దేశాల్లో వైరస్ మళ్లీ ప్రబలిందన్నారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, మున్సిపల్ వార్డుల్లో వాక్సినేషన్‌ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు గ్రామ, వార్డు స్థాయిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ బృందంలో ఆశా వర్కర్, అంగన్వాడీ వర్కర్, పంచాయతీ కార్యదర్శి, వీఆర్ఏ సభ్యులుగా ఉండాలన్నారు. ప్రతి గ్రామానికి ఒక నోడల్ అధికారి, మండలానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించి నిత్యం వాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. వాక్సిన్ డోసులు సరిపడా ఉన్నాయని సీఎస్‌ స్పష్టం చేశారు. కొవిద్ మహమ్మారి నుంచి కాపాడుకొనేందుకు కేవలం రెండు డోసులు వాక్సిన్ తీసుకోవడమే ఏకైక మార్గమనే సందేశాన్ని ప్రతి ఒక్కరిలో కల్పించాలని.. తద్వారా వాక్సినేషన్‌ను సమర్థంగా చేపట్టాలని సీఎస్‌ సూచించారు.

ఇదీ చూడండి:

Cs Review on Crops: ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన సదస్సులు:సీఎస్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.