ETV Bharat / state

CS SOMESH KUMAR: 'వారికి వెంటనే వ్యాక్సినేషన్ పూర్తి చేయండి' - telangana latest news

మూడో వేవ్​పై వార్తలు వస్తున్న నేపథ్యంలో జీహెచ్​ఎంసీ పరిసర ప్రాంతాల్లో ఇప్పటికీ టీకా తీసుకోని వారికి ప్రత్యేక డ్రైవ్​ ద్వారా వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని అధికారులను సీఎస్​ సోమేశ్​కుమార్​ ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్రంలో కొవిడ్ వ్యాక్సినేషన్ సహా ప్రభుత్వ ఆస్పత్రుల్లో సదుపాయాల కల్పనపై సీఎస్ వైద్యారోగ్యశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు.

CS SOMESH KUMAR: 'టీకా తీసుకోని వారికి త్వరగా వ్యాక్సినేషన్​ పూర్తి చేయాలి'

author img

By

Published : Aug 7, 2021, 6:23 PM IST

రాష్ట్రంలో కొవిడ్ వ్యాక్సినేషన్ సహా ప్రభుత్వ ఆస్పత్రుల్లో సదుపాయాల కల్పనపై సీఎస్ సోమేశ్​కుమార్ వైద్యారోగ్య శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. బీఆర్కే భవన్​లో జరిగిన ఈ సమావేశంలో ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, డీహెచ్ శ్రీనివాస రావు, డీఎంఈ రమేశ్​రెడ్డి సహా పలువురు అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని బోధన, జిల్లా ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని అధికారులను సీఎస్ సోమేశ్​కుమార్ ఆదేశించారు. ఆసుపత్రుల్లో ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లు, అదనపు అంతస్థుల నిర్మాణం, పిల్లల ఆక్సిజన్, ఐసీయూ పడకల పెంపు ప్రక్రియను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా మూడో వేవ్​పై వార్తలు వస్తున్న నేపథ్యంలో జీహెచ్​ఎంసీ పరిసర ప్రాంతాల్లో ఇప్పటికీ కొవిడ్ టీకా తీసుకోని వారందరికీ వీలైనంత త్వరగా వ్యాక్సినేషన్ పూర్తి చేసేందుకు ప్రత్యేక డ్రైవ్​లు ఏర్పాటు చేయాలని తెలిపారు.

ఇదీ చూడండి: సచివాలయ నిర్మాణ పనులను పరిశీలిస్తున్న సీఎం కేసీఆర్..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.