ETV Bharat / state

ప్రభుత్వాస్పత్రుల్లో ఓపీ సేవలు ప్రారంభించాలని సీఎస్‌ ఆదేశం - సీఎస్​ సోమేశ్​ కుమార్​ తాజా వార్తలు

హైదరాబాద్​లోని ప్రభుత్వాస్పత్రుల్లో ఓపీ సేవలు ప్రారంభించాలని సీఎస్‌ ఆదేశించారు. జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా తాజా పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు.

somesh kumar
సోమేశ్​ కుమార్​
author img

By

Published : May 2, 2021, 8:20 PM IST

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో కరోనా కేసులు అధికంగా ఉండటంతో.... కొవిడ్‌ లక్షణాలు కలిగిన వారిని గుర్తించేందుకు ఇంటింటి సర్వే చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం... ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని, ప్రతి ప్రత్యేక బృందంలో ఇద్దరు మున్సిపల్‌ స్టాఫ్‌, ఇద్దరు ఆశా వర్కర్లు, ఒక ఏఎన్‌ఎం ఉండేట్లు చూడాలని జీహెచ్‌ఎంసీ అధికారులకు స్పష్టం చేసింది. సీఎం కేసీఆర్‌ ఆదేశాలపై జీహెచ్ఎంసీ పరిధిలో కొవిడ్‌ తాజా పరిస్థితులపై అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ బీఆర్కే భవన్‌లో సమీక్ష నిర్వహించారు. వైద్యశాఖ కార్యదర్శి రిజ్వీ, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్​కుమార్‌, మెడికల్‌ డైరెక్టర్‌ రమేశ్‌రెడ్డి, డీహెచ్​ శ్రీనివాసరావు తదితరులు ఇందులో పాల్గొన్నారు.

అదేవిధంగా జీహెచ్ఎంసీ పరిధిలో జోనల్‌ కమిషనర్లతో, డిప్యూటీ కమిషనర్లతో బీఆర్కే భవన్‌ నుంచి సోమేశ్‌కుమార్‌ టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించి తాజా పరిస్థితులపై ఆరా తీశారు. కరోనా ఉద్ధృతి పరిస్థితులను అడిగి తెలుసుకున్న ఆయన... నగరంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో, అర్బన్‌ హెల్త్‌ సెంటర్లల్లో, బస్తీ దవాఖానాల్లో "ఔట్‌ పెషంట్‌ క్లినిక్‌''లను ప్రారంభించాలని జీహెచ్‌ఎంసీ అధికారులను ఆదేశించారు. కరోనా లక్షణాలు కలిగిన వారందరికీ ఈ క్లినిక్‌ల ద్వారా కొవిడ్‌ కిట్లు అందజేయాలని సూచించారు. ప్రత్యేక బృందాల ద్వారా నిర్వహించే సర్వేలో... కరోనా లక్షణాలు కలిగిన వారున్నట్లు గుర్తిస్తే... వెంటనే వారికి కరోనా కిట్లు అందజేయాలని, వారి ఆరోగ్యంపై ఆ బృందాలే పర్యవేక్షించాలని సోమేశ్‌కుమార్‌ స్పష్టం చేశారు. అన్ని ప్రభుత్వ, అర్బన్‌ ఆస్పత్రులు, బస్తీ దవాఖానాల్లో పరిశుభ్రతపై ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించాలని, ఆస్పత్రులను వైట్‌వాష్​ చేయించి... పరిశుభ్రంగా ఉండేట్లు చూడాలని, అన్ని సర్కిళ్లలో కొవిడ్‌ కేర్‌ కేంద్రాలను ప్రారంభించాలని ఆయన ఆదేశించారు.

ఇదీ చదవండి: ప్రజా తీర్పును గౌరవిస్తున్నాను: జానారెడ్డి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.