రాష్ట్రంలో 50 వేల ఉద్యోగాలు భర్తీ చేయాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు.. అధికారులు చర్యలు చేపట్టారు. అన్నిశాఖల కార్యదర్శులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో డీజీపీ మహేందర్ రెడ్డి సహా వివిధ శాఖల కార్యదర్శులు హాజరయ్యారు.
ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీల భర్తీపై సమీక్షించిన సీఎస్.. అన్ని శాఖల్లోని ఖాళీల వివరాలు ఇవ్వాలని అధికారులకు సూచించారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వేగవంతానికి ప్రత్యేకంగా ఓ విభాగం ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. నియామక ప్రక్రియ వేగవంతానికి రిక్రూట్‌మెంట్ విధానాల్లో సంస్కరణలు తీసుకురానున్నట్లు వివరించారు.