ETV Bharat / state

'కార్మికులు సమరోత్సాహంతో ఆందోళనల్లో పాల్గొంటున్నారు' - హైదరాబాద్​లోని పలు డిపోల ముందు నిరసన

ఆర్టీసీ కార్మికుల సమ్మెలో భాగంగా కుటుంబసభ్యులతో కలిసి హైదరాబాద్​లోని పలు డిపోల ముందు నిరసన తెలియజేశారు. ఈ నిరసనకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాల్గొన్నారు. కార్మికులు ఏమాత్రం నిరుత్సాహ పడకుండా... సమరోత్సాహంతో ఆందోళనల్లో పాల్గొంటున్నారని తెలిపారు.

CPM TAMMINENI VEERABADRAM PARTICIPATED IN 17TH DAY TSRTC STRIKE IN HYDERABAD
author img

By

Published : Oct 21, 2019, 5:38 PM IST

హైకోర్టు ఇచ్చిన సూచనలు కూడా ప్రభుత్వం బేఖాతరు చేస్తూ... ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా తాత్సారం చేస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మండిపడ్డారు. హైదరాబాద్​లోని పలు డిపోల ముందు కుటుంబ సభ్యులతో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న నిరసనల్లో తమ్మినేని పాల్గొన్నారు. తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లకు పూలిచ్చి తమకు మద్దతివ్వాలని విన్నవించారు. అన్ని వర్గాల వారు బంద్​లో పాల్గొని విజయవంతం చేశారని తమ్మినేని తెలిపారు. కార్మికులకు సీఎం కేసీఆర్​ అన్ని మార్గాలు మూసేయటం వల్ల పోరాటం ద్వారా తమ హక్కులు సాధించుకునేందుకు సిద్ధమయ్యారని స్పష్టం చేశారు. భవిష్యత్ కార్యాచరణ ప్రకారం రానున్న రోజుల్లో మరింత ఉద్ధృతంగా కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు. ఇకనైనా కేసీఆర్​ కళ్ళు తెరిచి సామరస్యపూర్వకంగా చర్చలకు ఆహ్వానించాలని తమ్మినేని వీరభద్రం కోరారు.

'కార్మికులు సమరోత్సాహంతో ఆందోళనల్లో పాల్గొంటున్నారు'

ఇవీ చూడండి: ప్రగతి భవన్​ బయల్దేరిన రేవంత్​... అరెస్ట్

Intro:సికింద్రాబాద్ యాంకర్..హైకోర్టు ఇచ్చిన సూచనలు కూడా ప్రభుత్వం బేఖాతరు చేస్తూ ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా తాత్సారం చేస్తోందని సీపీఎం తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు..కుటుంబ సభ్యులతో ఆర్టీసీ కార్మికులు రాణిగంజ్ వద్ద నిరసనకు దిగారు...ఆర్టీసీ కార్మికుల సమస్యలు ఒక వైపు ఉంటే తాత్కాలిక డ్రైవర్లు కండక్టర్ల నియామకాలు చేపట్టి తమ కడుపు కొట్టే ప్రయత్నం చేస్తున్నారని వారు బస్సులో ఉన్న తాత్కాలిక డ్రైవర్లు కండక్టర్లను కలిసి తమకు మద్దతు తెలపాలని విన్నవించారు..ఈ సందర్భంగా జేబీఎస్ కు వచ్చిన తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ ట్రేడ్ యూనియన్లు మరియు అన్ని వర్గాల వారు బంద్ కు పిలుపునిచ్చి విజయవంతం చేశారని అన్నారు..హైకోర్టు ఆదేశాల మేరకు చర్చలు చేపట్టాల్సిన ప్రభుత్వం ఇంతవరకు స్పందించకపోవడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు..కార్మికులకు ఎలాంటి చర్చ లేకుండా ఉద్యోగం నుండి తొలగిస్తున్నట్లు చెప్పడం సరైన పద్ధతి కాదని అందుకే తాము పోరాటాన్ని ఎంచుకుని పోరాటం ద్వారా సాధిస్తామని ఆయన అన్నారు ...తెలంగాణలోని అన్ని ఆర్టీసీ డిపోల వద్ద కుటుంబ సభ్యులతో పెద్ద ఎత్తున దీక్షలు కొనసాగుతున్నట్లు ఆయన వెల్లడించారు భవిష్యత్ కార్యాచరణ ప్రకారం రానున్న రోజుల్లో మరింత ఉదృతంగా కార్యక్రమాలు కొనసాగుతాయని ఆయన వెల్లడించారు ఇకనైనా ముఖ్యమంత్రి కళ్ళు తెరిచి సామరస్యపూర్వకంగా చర్చలకు ఆహ్వానించిన సమస్యను పరిష్కారం దిశగా మార్గం చూపాలని వారు కోరుతున్నారు..తమ్మినేని వీరభద్రం సిపిఎం నాయకులుBody:VamshiConclusion:7032301099
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.