ETV Bharat / state

భారత్​ బంద్​కు సీపీఎం మద్దతు: తమ్మినేని వీరభద్రం

శుక్రవారం జరగనున్న అఖిల భారత వ్యాపార సంఘాల భారత్‌బంద్‌కు పూర్తి మద్దతు ఇస్తున్నట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. కేంద్రంలో అధికార భాజపా ప్రజలను దోచుకుంటోందని విమర్శించారు. పేదలపై ధరల భారం మోపుతోందని ఆయన మండిపడ్డారు.

cpm full support for tomorrow bharat bandh to oppose rates in country on central policies declares by tammineni Slug
భారత్​ బంద్​కు సీపీఎం మద్దతు : తమ్మినేని వీరభద్రం
author img

By

Published : Feb 25, 2021, 10:45 PM IST

కేంద్రం ధరలు సామాన్య ప్రజలపై భారం వేస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మండిపడ్డారు. రేపు చేపట్టనున్న అఖిల భారత వ్యాపారుల సంఘాలు చేపట్టిన భారత్ బంద్​కు పూర్తి మద్దతు ఇస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

భాజపా అధికారంలోకి వచ్చాక వ్యాపారులు, ప్రజలపై ధరలు పెంచుతూ అధిక భారం మోపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలక్ట్రానిక్‌ వేబిల్​, చమురు ధరలపై భారీ పన్నులు, జీఎస్‌టీ పన్నులతో ప్రజలందరిపై భారం పడుతుందన్నారు. ఈ బంద్‌కు తమ మద్దతు తెలియజేస్తున్నట్లు ఒక ప్రకటనలో తమ్మినేని తెలిపారు.

ఇదీ చూడండి : 'నూతన చట్టాలు అమలు చేసి పరిశుభ్రంగా ఉంచండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.