కేంద్ర ప్రభుత్వం రూపొందించిన కరెంటు సవరణ బిల్లును ఉపసంహరించాలని సీపీఎం డిమాండ్ చేసింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే విద్యుత్ సవరణ బిల్లు వల్ల వ్యవసాయ, పారిశ్రామిక రంగం తీవ్ర సంక్షోభంలోకి పోతోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆవేదన వ్యక్తం చేశారు.
కేంద్ర ప్రభుత్వం రూపొందించిన విద్యుత్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని ఎంబీ భవన్ సమీపంలోని రోడ్డుపై సీపీఎం నాయకులు నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే విద్యుత్ సవరణ బిల్లు వల్ల డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అధికారులు పూర్తిగా కోల్పోవడం సాధ్యమని దీనివల్ల ప్రభుత్వ అజమాయిషి పూర్తిగా కోల్పోతుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ బిల్లును వ్యతిరేకించినప్పటికీ అమలు చేయకుండా పటిష్టంగా అడ్డుకోవాలని సూచించారు.
ఇదీ చూడండి: వలస కూలీలను పంపేందుకు చర్యలు: మంత్రి శ్రీనివాస్ గౌడ్