లాక్‌డౌన్ నేపథ్యంలో కార్మికులకు ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీల ఈఎంఐల నుంచి వెసులుబాటు కల్పించాలని ప్రభుత్వాన్ని సీపీఎం రాష్ట్ర శాఖ కోరింది.
రాష్ట్రంలో లక్షలాది మంది రవాణా రంగ కార్మికులు ఇంటి అద్దెలు కట్టలేక.. నిత్యవసర సరకులు కొనలేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. వీరిలో అత్యధికులు ప్రైవేటు కంపెనీల వద్ద రుణాలు తీసుకుని స్వయం ఉపాధితో జీవనం సాగిస్తున్నారని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో రుణ వాయిదాలు చెల్లించడం కష్టంగా మారిందన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి రుణవాయిదాల నుంచి వెసులుబాటు కల్పించాలని సీపీఎం కోరింది. కేరళ ప్రభుత్వం మాదిరిగా తెలంగాణలోనూ ప్రతి కార్మిక కుటుంబానికి రూ.5 వేలు ఆర్థిక సహాయం చేయాలని డిమాండ్ చేసింది.
ఇవీచూడండి: రాష్ట్ర మంత్రివర్గం భేటీ.. లాక్డౌన్పై కీలక చర్చ