ఏడేళ్లుగా ప్రజలను మోసం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం రెండు పడక గదుల ఇళ్లు ఇచ్చే వరకూ పోరాటం కొనసాగిస్తామని సీపీఎం సెంట్రల్ జోన్ కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఇళ్ల కోసం వచ్చిన పేదల దరఖాస్తులను పరిశీలించాలని డిమాండ్ చేశారు. అర్హులైన వారికి ఇళ్లు కేటాయించాలని కోరుతూ హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలో సీపీఎం ఆధ్వర్యంలో మహిళలు ధర్నా చేశారు.
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా...సీఎం కేసీఆర్ పేదలను మోసం చేశారని ఆయన ఆరోపించారు. 15ఏళ్ల క్రితం ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు నేటికీ ఇళ్లు కేటాయించకపోవడం విచారకరమన్నారు.
ఇదీ చదవండి: రెండు పెళ్లిళ్లు చేసుకున్న భర్తకు భార్యల దేహశుద్ధి