ETV Bharat / state

వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం: సీపీఐ

సాయం కోసం వరద బాధితులు దీనంగా ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని సీపీఐ నేతలు విమర్శించారు. నిరాశ్రయులైన వారికి భోజనం, మంచినీరు వంటి కనీస సౌకర్యాలు కల్పించడం లేదని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ జీహెచ్​ఎంసీ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు.

cpi protest for flood victims in Hyderabad
వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం: సీపీఐ
author img

By

Published : Oct 21, 2020, 6:38 PM IST

వరద బాధితులను ఆదుకోవడం... సహాయ కేంద్రాలకు తరలించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీపీఐ నాయకులు ఆరోపించారు. సాయం కోసం దీనంగా ఎదురు చూడాల్సిన దుస్థితి ఏర్పడిందని విమర్శించారు. హైదరాబాద్ బషీర్ బాగ్​లోని ఓల్డ్ కమేలా బస్తీలో భారీ వర్షాలకు ఇళ్ళు కూలిపోయి... నిరాశ్రయులుగా మారిన పేద ప్రజలను తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ... అబిడ్స్​లోని జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయం ఎదుట బాధితులతో కలిసి సీపీఐ నాయకులు ధర్నా చేపట్టారు.

'పట్టించుకోవడం లేదు'

మూడు రోజుల నుంచి సుమారు 60 మంది బాధితులు కట్టుబట్టలతో బస్తీలోని చిన్న కమ్యూనిటీ కేంద్రంలో ఆశ్రయం పొందుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ అధికారులు భోజనం, మంచి నీరు వంటి కనీస వసతులూ కల్పించడం లేదని ఆరోపించారు. నిధులు విడుదల చేసినా ఫంక్షన్ హాళ్లు అద్దెకు తీసుకొని బాధితులకు ఎందుకు ఆశ్రయం కల్పించడం లేదని ప్రశ్నించారు. వర్షాలతో పూర్తిగా ఇళ్ళు కూలిపోయిన వారికి కొత్త ఇళ్లు మంజూరు చేస్తామని సీఎం కేసీఆర్ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.

'తక్షణమే చర్యలు చేపట్టాలి'

బాధితులకు యుద్ధ ప్రతిపాదికన సాయం అందించాలని కోరారు. బషీర్ బాగ్ లోని ఓల్డ్ కమేలా బస్తీలో వర్షాలతో కూలిపోయిన ఇళ్ల స్థానంలో తక్షణమే ప్రభుత్వం కొత్త ఇళ్లు కట్టి ఇవ్వాలని... లేదంటే తగిన ఆర్థిక సాయం అందించాలన్నారు. నిరాశ్రయులను ఆదుకునే బాధ్యత ప్రభుత్వానిదేనని, నిర్లక్ష్యం చేస్తే ఊరుకునేది లేదని సీపీఐ నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ఇదీ చదవండి: భారీ వర్షాలతో రోడ్లు చిన్నాభిన్నం...ప్రయాణం నరకప్రాయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.