కమ్యూనిస్టు యోధుడు చండ్ర రాజేశ్వరరావు.. తన జీవిత చరమాంకంలో వృద్ధుల కోసం ఆశ్రమాన్ని ఏర్పాటు చేయాలనుకునే వారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఆయన కోరిక మేరకు 1995లో కొండాపూర్‌లో ఆహ్లాదకరమైన వాతావరణంలో చండ్ర రాజేశ్వరరావు పేరుతో వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ ఆశ్రమంలో 150మందికి ఆశ్రయం కల్పిస్తున్నట్లు చెప్పారు.
భారతదేశంలోనే ఈ ఆశ్రమం మంచి పేరు తెచ్చుకుందని నారాయణ అన్నారు. ప్రస్తుతం వృద్ధాశ్రమ నిర్వహణకు ఆర్థిక ఇబ్బందులు కలుగుతున్నాయని.. ప్రజలు, ప్రభుత్వం ఆర్థికంగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: నేతాజీ నేటి యువతకు ఆదర్శం: లక్ష్మణ్