సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ కంటైన్మెంట్ ప్రాంతాల్లో పర్యటించారు. అల్వాల్ పరిధిలోని హస్మత్పేట్ చంద్రనగర్ కాలనీలను పరిశీలించారు. ఆ ప్రాంతాల్లో చేపడుతున్న చర్యల గురించి తెలుసుకున్నారు. అనవసరంగా బయట తిరిగితే కఠినంగా వ్యవహరించి కేసులు నమోదు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటిస్తూ ఇళ్లలోనే ఉండాలన్నారు.
కొన్ని చోట్ల ప్రజలు భౌతిక దూరాన్ని పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించడం సరైన పద్ధతి కాదని హెచ్చరించారు. కచ్చితంగా సామాజిక దూరాన్ని పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇప్పటివరకు సైబరాబాద్ పరిధిలో పదివేల కేసులు, రెండు లక్షల ట్రాఫిక్ ఉల్లంఘనలు జరిగాయని తెలిపారు. లాక్డౌన్ పూర్తయ్యేవరకు ప్రజలంతా బయటకు రాకుండా పోలీసులకు సహకరించాలని కోరారు.
ఇదీ చూడండి : అక్కడ గాంధీ విగ్రహానికి మాస్క్ కట్టారు