భావన ఫిర్యాదు మేరకు ఐపీఎస్ శిక్షణాధికారి మహేశ్వర్ రెడ్డిపై జవహర్ నగర్ పీఎస్లో కేసు నమోదు చేసినట్లు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. మహేశ్వర్ రెడ్డి ప్రస్తుతం ఐపీఎస్ శిక్షణ తీసుకుంటున్న ముస్సోరీలోని శిక్షణా కేంద్రానికి...అతనిపై క్రిమినల్ కేసు నమోదైన విషయం గురించి లేఖ రాసినట్లు వివరించారు. మహేశ్వర్ రెడ్డి బెయిల్ కోసం హైకోర్టును సంప్రదించాడని...బెయిల్ ఇవ్వొద్దని భావన తరఫున కౌంటర్ దాఖలు చేసినట్లు సీపీ తెలిపారు. మహేశ్వర్ రెడ్డికి 41(ఏ) సీఆర్పీసీ నోటీసులు జారీచేసి దర్యాప్తు చేయాలని హైకోర్టు ఆదేశించిందని మహేశ్ భగవత్ వెల్లడించారు. ఇదివరకు రెండు సార్లు భార్యాభర్తల మధ్య విభేదాల వల్ల పోలీసులను సంప్రదించగా కౌన్సిలింగ్ ఇచ్చామన్నారు. భావన ఫిర్యాదు మేరకు గత నెల 27న మహేశ్వర్ రెడ్డిపై వేధింపులు, ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. భావన, మహేశ్వర్ రెడ్డి పెళ్లిని...ఇరుకుటుంబాలు అంగీకరించి...శిక్షణ అనంతరం విందు ఏర్పాటు చేయడానికి సమ్మతించారని...మళ్లీ భావన ఫిర్యాదు చేయడం వల్ల కేసు నమోదు చేశామని తెలిపారు.
ఇదీ చదవండిః కేసు పెట్టినా పట్టించుకోవట్లేదు.. ట్రైనీ ఐపీఎస్ అనా..?