ఆర్టీసీ ఐకాస తలపెట్టిన ఛలో ట్యాంక్ బండ్ కార్యక్రమంలో మావోయిస్టు అనుబంధ సంఘాల సభ్యులు పాల్గొన్నారని సీపీ అంజనీ కుమార్ వెల్లడించారు. ట్యాంక్ బండ్ ముట్టడికి పోలీసులు అనుమతి నిరాకరించినా.... భద్రతా వలయాన్ని ఛేదించుకుని వచ్చిన పలువరు రాజకీయ పార్టీలకు చెందిన కార్యకర్తలు, మావోయిస్టు అనుబంధ సంఘాల సభ్యులు పోలీసులపై రాళ్లు రువ్వారని పేర్కొన్నారు. ఏడెనిమిది చోట్ల రాళ్లు రువ్వడం వల్ల పలువురు పోలీస్ అధికారులు గాయపడ్డారని సీపీ తెలిపారు. భద్రతా వలయాన్ని ఛేదించుకుని వస్తున్న గుంపును అదుపు చేసేందుకు పోలీసులు లాఠీఛార్జీ చేశారని స్పష్టం చేశారు. పోలీసులపై దాడికి కారణమైన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అంజనీ కుమార్ తెలిపారు.
ఇవీచూడండి: అయోధ్యలో రామమందిరం- ముస్లింలకు ప్రత్యామ్నాయ స్థలం