రాష్ట్రంలో కొత్తగా 1,764 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 58,906కు చేరుకుంది. మరో 12 మంది మృతి చెందగా మొత్తం మృతుల సంఖ్య 492కు చేరింది. మొత్తం 14,663 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
కరోనా నుంచి కోలుకుని నిన్న 842 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 43,751 మంది కోలుకున్నారు. నిన్న 18,858 కరోనా పరీక్షలు నిర్వహించగా 1764 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీలో అత్యధికంగా మరో 509 కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి, వరంగల్ అర్బన్ తరువాత స్థానంలో ఉన్నాయి. మొత్తం 3,97,939 మందికి కొవిడ్ నిర్ధరణ పరీక్షలు చేశారు.