ETV Bharat / state

కోరుకున్న చోట పోస్టింగుకు కొత్తదారి.. - హైదరాబాద్​ లేటెస్ట్​ వార్తలు

కోరుకున్న చోటకు బదిలీ చేయించుకునేందుకు లక్షల్లో ముడుపులు చేతులు మారుతున్నాయి. కొంత మంది వైద్య శాఖ ఉద్యోగులు కావాలని సరెండర్​ చేయించుకుని.. తర్వాత కోరుకున్న చోటకు బదిలీ చేయించుకుంటున్నారు. ఈ తరహ వ్యవహారాలు రాష్ట్రంలో చాలా చోట్ల జరుగుతున్నాయి.

corruption for transfers in health departments in telangana
కోరుకున్న చోట పోస్టింగుకు కొత్తదారి.. చేతులు మారుతున్న లక్షల రూపాయలు
author img

By

Published : Dec 10, 2020, 7:13 AM IST

వనపర్తి జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న ఓ అధికారి పనితీరు సంతృప్తిగా లేదంటూ ఆ జిల్లా ఉన్నతాధికారి ఇటీవల ప్రజారోగ్య సంచాలకుల కార్యాలయానికి ఆ ఉద్యోగిని తిరిగి అప్పగించారు (సరెండర్‌ చేశారు). కొద్దిరోజుల తర్వాత ఆ ఉద్యోగి మేడ్చల్‌ జిల్లాలో పోస్టింగ్‌ కోసం ఉన్నతస్థాయి పైరవీలతో రంగంలోకి దిగాడు. త్వరలోనే కోరుకున్న చోటుకు పోస్టింగు ఇచ్చేందుకు ఏర్పాట్లు పూర్తయినట్లుగా తెలిసింది. అసలు కోరుకున్న చోట పోస్టింగు కోసమే సరెండర్‌ చేయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో లక్షల రూపాయల ముడుపులు చేతులు మారినట్లుగా ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంలో కింది స్థాయి అధికారుల నుంచి ఉన్నత స్థాయి వరకూ ప్రమేయం ఉన్నట్లుగా ఫిర్యాదులున్నాయి.

ఉన్నతాధికారులపై ఒత్తిడి

సిద్దిపేటకు చెందిన ఓ అధికారి రాష్ట్ర కార్యాలయానికి సరెండర్‌ చేయించుకున్నాడు. తిరిగి తనకు సూర్యాపేటలో పోస్టింగ్‌ ఇవ్వాలంటూ పెద్దఎత్తున ఉన్నతాధికారులపై ఒత్తిడి చేయిస్తున్నట్లుగా సమాచారం. ఈ ఏడాది నవంబరు 13న 11 మంది డిప్యూటీ మీడియా అధికారులకు ఆరోగ్య విద్య, విస్తరణ అధికారులుగా పదోన్నతి కల్పించారు. దీంతో ఏర్పడిన ఖాళీలను తిరిగి పదోన్నతి విధానంలో భర్తీ చేయాల్సి ఉంది. దీని కోసం గత 18 ఏళ్లుగా హెల్త్‌ ఎడ్యుకేటర్‌లు ఎదురు చూస్తున్నారు. వీరందరిని పక్కనబెట్టి.. కొందరు సరెండర్ల పేరిట అక్రమంగా ఆయా స్థానాల్లో పాగా వేయాలని పన్నాగాలు పన్నుతున్నారు.

వైద్య వర్గాల్లో చర్చ.. విచారణకు ఆదేశం

ఈ రెండు ఉదంతాల్లోనూ పనితీరు సరిగా లేకపోతే శిక్షించాల్సింది పోయి..ఆ ఉద్యోగులకు మరింత మెరుగైన స్థానంలో నియామకాలివ్వడమేమిటనేది వైద్యవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇదే విషయంపై వైద్యఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీకి బుధవారం కొందరు ఉద్యోగులు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అక్రమ సరెండర్ల వ్యవహారంపై తీవ్రంగా స్పందించిన ప్రభుత్వం.. తక్షణమే విచారణ నిర్వహించాలని ఆదేశించింది.

వేళ్లూనుకున్న అవినీతి

ప్రజారోగ్య సంచాలకుల కార్యాలయంలో ఎన్ని మార్పులు చేసినా కొందరి మూలంగా అవినీతి చీడ వీడడం లేదు. ముఖ్యంగా దీర్ఘ కాలంగా సెలవుల్లో వెళ్లిన వైద్యులు, నర్సులను క్రమబద్ధీకరించే వ్యవహారంలో ఆ శాఖ సంచాలకుల కార్యాలయంలో భారీగా ముడుపులు చేతులు మారుతున్నాయి. కొందరు అధికారులు ప్రలోభాలకు లొంగిపోయి, ఈ తరహాలో అక్రమ పోస్టింగులను ప్రోత్సహిస్తున్నట్లుగా ఇటీవల ప్రభుత్వానికి ఫిర్యాదులందాయి. ముఖ్యంగా హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో పోస్టింగులకు ఎక్కువగా గిరాకీ ఉంది. జిల్లాల్లో నియామక ఉత్తర్వులిచ్చినా ఏదో ఒక నెపంతో దీర్ఘకాలం సెలవులు పెట్టడం.. రాష్ట్ర కార్యాలయానికి తిరిగి అప్పగించేలా చేసుకోవడం.. ఇక్కడ్నించి మళ్లీ జీహెచ్‌ఎంసీ పరిసరాల్లోనే పోస్టింగు రప్పించుకోవడం అనేది పరిపాటిగా మారింది. ఈ అక్రమ పోస్టింగుల్లో జిల్లా వైద్యాధికారులది ముఖ్యపాత్రగా ఉంటోందని ఆరోపణలున్నాయి. ఈ కారణంగానే ఉద్యోగులను సరెండర్‌ చేస్తున్నారని.. వారు కొద్ది రోజులు వేచిచూసి.. ప్రజారోగ్య సంచాలకుల కార్యాలయంలో పైరవీలు చేస్తున్నారన్నది ప్రధాన ఆరోపణ.

జిల్లా వైద్యాధికారిపై చర్యలు

సరెండర్ల పేరిట దొడ్డిదారిన పోస్టింగు పొందాలని కొందరు ప్రయత్నిస్తున్నట్లుగా ఫిర్యాదులు మా దృష్టికి వచ్చాయి. అటువంటి వారికి పోస్టింగులు ఇవ్వబోం. అలా చేసినందుకు ముందుగా సంబంధిత జిల్లా వైద్యాధికారిపై చర్యలు తీసుకుంటాం.

-డాక్టర్‌ జి.శ్రీనివాసరావు, ప్రజారోగ్య సంచాలకులు

సరెండర్‌ అంటే?

ఏ ఉద్యోగైనా సంతృప్తికరంగా విధులు నిర్వర్తించకపోతే.. ఆ ఉద్యోగి సేవలపై సంబంధిత జిల్లా అధికారి అసంతృప్తి వ్యక్తం చేస్తూ, సదరు ఉద్యోగి సేవలు తమకు పనికిరావని పేర్కొంటూ ప్రజారోగ్య సంచాలకుల కార్యాలయానికి అప్పగిస్తారు. దీన్నే ఉద్యోగ వర్గాల్లో ‘సరెండర్‌’ అని పిలుస్తుంటారు. సంబంధిత ఉద్యోగికి ఉన్నతాధికారులు ఛార్జీ మెమో ఇచ్చి, క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు. ఈ క్రమంలో శిక్షకు అర్హుడిగా పరిగణించి, బదిలీ చేస్తుంటారు.

ఇదీ చదవండి: కొత్త పార్లమెంట్ భవనానికి నేడు శంకుస్థాపన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.