ETV Bharat / state

ఫీజుల నిర్ధారణ లేదు.. హాస్టళ్లకు అనుమతుల్లేవ్.. ఇష్టారాజ్యంగా 'కార్పొరేట్'

Telangana Corporate Junior Colleges : ప్రైవేట్, కార్పొరేట్ జూనియర్ కళాశాలలకు అసలు నియంత్రణ ఉండటం లేదు. ఈ కళాశాలకు ఫీజుల నిర్ధారణ లేదు.. హాస్టళ్లకు అనుమతులుండవు.. అడ్డగోలుగా కాలేజీలు నడుపుతున్నా చర్యలు ఉండవు.. విద్యార్థుల ఆత్మహత్యలు జరిగినప్పుడు మాత్రమే ఇంటర్‌బోర్డు, విద్యాశాఖ హడావుడి చేస్తుంది కానీ సమస్యలకు శాశ్వత పరిష్కారాలు మాత్రం తీసుకోవు. అందుకే రాష్ట్రంలో ప్రైవేట్, కార్పొరేట్ కాలేజీలే ఆడిందే ఆటగా మారింది. ఇంటర్ బోర్డు హెచ్చరికలను కూడా ఈ కళాశాలల యాజమాన్యాలు ఖాతరు చేయడం లేదు. నిబంధనలకు తూట్లు పొడుస్తూ ఇష్టమొచ్చినట్లు ఫీజులు పెంచుతుండటం విద్యార్థుల తల్లిదండ్రులకు శాపంగా మారుతోంది.

Telangana Corporate Junior Colleges
Telangana Corporate Junior Colleges
author img

By

Published : Apr 4, 2023, 8:00 AM IST

Telangana Corporate Junior Colleges : తెలంగాణలో దాదాపు ఎక్కువ మంది విద్యార్థులు ప్రైవేట్, కార్పొరేట్ కాలేజీలకే వెళ్తున్నారు. 9.50 లక్షల మందిలో 5 లక్షల మంది వరకు ఈ కళాశాలల బాటే పడుతున్నారు. ఇందులో ఏడాదిలో రెండు మూడు కళాశాలల్లోని విద్యార్థులు ఎక్కువగా బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. దానికి కారణం మార్కుల కోసం ఆయా కాలేజీలు పిల్లలపై ఒత్తిడి పెంచడమేనన్న ఆరోపణలు ఉన్నాయి. అయినా దీనిపై అటు ఇంటర్ బోర్డు కానీ.. ఇటు విద్యాశాఖ కానీ ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు.

విద్యార్థుల ఆత్మహత్యలు పట్టించుకోని బోర్డు.. 2017లో విద్యార్థుల ఆత్మహత్యలు ఎక్కువగా జరగడం వల్ల.. 20 ఏళ్ల క్రితం ఆచార్య నీరదారెడ్డి కమిటీ సిఫార్సు చేసిన ఆదేశాలు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. అయినా వాటిని పట్టించుకున్న నాథుడేలేడు. ఫలితంగా 2019లో పరీక్షల ఫలితాల్లో ఇంటర్ బోర్డు చూపిన నిర్లక్ష్యం వల్ల పలువురు విద్యార్థులు ప్రాణాలు తీసుకున్నారు. ఆ తర్వాత చర్యలు చేపట్టిన బోర్డు.. కాలేజీకి ఒక అధ్యాపకుడిని స్టూడెంట్ కౌన్సిలర్‌గా నియమించింది. పరీక్షలు, ఫలితాల సమయంలో సైకాలజిస్టులను కూడా నియమించి విద్యార్థులకు ఎలాంటి అనుమానాలు, ఒత్తిడి ఉన్నా వారిని సంప్రదించొచ్చని ఫోన్ నంబర్లు ఇచ్చారు. ఇక తాజాగా వాటి స్థానంలో టోల్‌ ఫ్రీ నంబర్‌ను విద్యార్థుల కోసం తీసుకొచ్చారు.

లక్షల్లో ఫీజులు.. హాస్టళ్లకు అనుమతులు మాత్రం అనవసరం.. ఇక ఫీజుల భారం రోజురోజుకు విద్యార్థుల తల్లిదండ్రులకు శాపంగా మారుతున్నా.. వాటిపై నియంత్రణ కరవైంది. ఫీజుల నియంత్రణకు చర్యలు చేపడతామని ప్రభుత్వం గతేడాది జనవరిలో ప్రకటించింది. కానీ ఆ దిశగా చర్యలు మాత్రం శూన్యం. చిన్న జనరల్‌స్టోర్ పెట్టుకున్నా.. జీహెచ్‌ఎంసీ, వాణిజ్య పన్నుల శాఖకు డబ్బు చెల్లించి పర్మిషన్ తీసుకుంటారు. కానీ వందల మంది విద్యార్థులు.. లక్షల్లో ఫీజులు కడుతున్నా.. హాస్టళ్లకు మాత్రం అనుమతులు తీసుకోవాల్సిన అవసరం ఉండకపోవడం కాస్త విడ్డూరమే.

హాస్టళ్లు తమ పరిధిలోకి రావని చెబుతూ గతంలోనే ఇంటర్ బోర్డు చేతులెత్తేసింది. అయితే అప్పటి విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆచార్య.. హాస్టళ్లు కూడా కాలేజీల్లో భాగమేనని చెప్పడంతో.. దిగొచ్చిన బోర్డు.. 2018లో హాస్టళ్లకు కూడా అనుమతులు ఉండాలని ఉత్తర్వులు జారీ చేసింది. అయితే దీనిపై పలు కాలేజీలు.. బోర్డుకు ఆ అధికారం లేదంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. ఇది గడిచి ఐదేళ్లవుతున్నా.. ఆ సమస్యపై పరిష్కారం ఇప్పటి వరకూ తీసుకోలేదు.

జూనియర్ కళాశాల అని పేరు ఉంటే.. ఇంటర్ బోర్డు అనుమతి తప్పనిసరి. ఇక తనిఖీలు, గుర్తింపు ఫీజు చెల్లించాల్సి వస్తుంది. దీనికి దాదాపు రూ.3 లక్షలు ఖర్చవుతుంది. ఇక సెక్షన్లను బట్టి అధ్యాపకులు, సిబ్బందిని కూడా చూపించాలి. అందుకే వీటి నుంచి తప్పించుకునేందుకు కొన్ని కళాశాలల యాజమాన్యాలు ఓ ఉపాయం ఆలోచించాయి. కాలేజీలకు అకాడమీల పేర్లు పెట్టుకుని నిబంధనలు తుంగలో తొక్కి యథేచ్ఛగా క్లాసులు చెబుతున్నాయి. దీనివల్ల ప్రతి సంవత్సరం బోర్డుకు రూ.4 కోట్ల ఆదాయం నష్టమొస్తోంది.

ఇక కళాశాలల్లో ప్రతి అడుగులో నిబంధనలకు పాతర వేస్తున్నారు. ఇంటర్ బోర్డు అకడమిక్ షెడ్యూల్ జారీ చేసి అందులో తరగతులు ఎన్నింటికి ప్రారంభించాలో సూచిస్తోంది. కానీ దీన్ని ఏ కాలేజీలు కూడా పాటించడం లేదు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు క్లాసులు నడపాల్సి ఉంటుంద. కానీ చాలా వరకు కాలేజీలు ఉదయం 6 నుంచి తరగతులు షురూ చేస్తున్నాయి.

ఇక ఫీజులు వసూల్‌ చేయడంలో విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నాయి. ఫీజు కట్టకపోతే హాల్ టికెట్ ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నాయి. ఈ క్రమంలోనే కొందరు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. పండుగ సెలవుల్లో తరగతులు నిర్వహించొద్దన్న ఇంటర్ బోర్డు హెచ్చరికలను చాలా వరకు కళాశాలలు బేఖాతరు చేస్తున్నాయి. ఈ విషయంలోనూ ఇంటర్ బోర్డు చర్యలు శూన్యం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.