ETV Bharat / state

అమానవీయం: కరోనాతో మృతి.. జేసీబీతో ఖననం

దహనసంస్కారాలు లేకుండానే కరోనా మృతదేహాలను ఖననం చేస్తున్నారు. ఏపీలోని నెల్లూరు జిల్లాలో కరోనాతో మరణించిన ముగ్గురిని అధికారులు అర్ధరాత్రి ఖననం చేశారు. గుట్టుచప్పుడు కాకుండా జేసీబీతో పెద్ద గోతులు తీసి, రసాయనాలతో ఖననం చేస్తున్న వీడియో వైరల్​గా మారింది. అయితే 'పెన్నాలో కొవిడ్‌ మృతుల ఖననం' శీర్షికతో ఈనాడు-ఈటీవీ భారత్​లో ప్రచురితమైన కథనానికి... జిల్లా సంయుక్త కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి స్పందించారు.

Corona's bodies are being buried with JCB  in nellore
అమానవీయం: కరోనాతో మృతి.. జేసీబీతో ఖననం
author img

By

Published : Jul 10, 2020, 6:06 PM IST

అమానవీయం: కరోనాతో మృతి.. జేసీబీతో ఖననం

ఆంధ్రప్రదేశ్​లోని నెల్లూరులో కరోనాతో చనిపోయిన ముగ్గురి మృతదేహాలను గ్రామస్థులు అడ్డుకోవడంతోనే పెన్నానది ఒడ్డున అర్ధరాత్రి ఖననం చేసినట్టు అధికారులు వెల్లడించారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఇలా చేశామని సమాధానం ఇచ్చారు.

అర్ధరాత్రి పెన్నానది ఒడ్డున గుట్టు చప్పుడు కాకుండా ఖననం చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. కరెంట్‌ ద్వారా దహనం చేసే పరికరానికి అనుమతి కోరినట్లు తహసీల్దార్​ వెంకటేశ్వర్లు తెలిపారు. కరోనాతో చనిపోయిన వారిలో 6 గంటల తర్వాత వారి శరీరంలో వైరస్‌ ఉండదని నిపుణులు చెబుతున్నారు. ప్రజల్లో అవగాహన లేకపోవడం వల్ల వారిని తీసుకెళ్లేందుకు కుటుంబసభ్యులు కూడా ముందుకు రావడం లేదు. కొన్నిచోట్ల తీసుకెళ్లినా గ్రామస్థులు అడ్డుకుంటున్నారు. తప్పని పరిస్థితుల్లో అధికారులే ఖననం చేస్తున్నారు.

'పెన్నాలో కొవిడ్‌ మృతుల ఖననం' శీర్షికతో ఈనాడు-ఈటీవీ భారత్​లో ప్రచురితమైన కథనానికి... జిల్లా సంయుక్త కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి స్పందించారు. కరోనా మృతదేహాల ఖననంపై విచారణ చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. విచారణాధికారిగా నెల్లూరు ఆర్డీవో హుస్సేన్‌సాహెబ్‌ నియామంచినట్లు ఆయన తెలిపారు.

ఇదీ చదవండి: కూల్చివేత ఎఫెక్ట్​: ఆలయం, మసీదు దెబ్బతినటంపై సీఎం ​విచారం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.