ETV Bharat / state

తెలంగాణ సీఎంవోలో కరోనా కలకలం - corona virus update in hyderabad

భాగ్యనగరంలో కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తోంది. తాజాగా తెలంగాణ సీఎంవోలో కరోనా కలకలం రేపింది. బేగంపేటలోని మెట్రోరైల్​ భవన్​లో విధులు నిర్వహిస్తున్న సీఎంవో ఉద్యోగికి కరోనా పాజిటివ్​ అని తేలింది. దీంతో పాటు నగరంలో పలు చోట్ల కరోనా పాజిటివ్​ కేసులను అధికారులు గుర్తించారు.

corona update in greater hyderabad
తెలంగాణ సీఎంవోలో కరోనా కలకలం
author img

By

Published : Jun 6, 2020, 8:41 PM IST

కరోనా వైరస్ హైదరాబాద్‌లో చాపకింద నీరులా విస్తరిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, సిబ్బంది కూడా పెద్దసంఖ్యలో కరోనా భారిన పడుతున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయంలోని కొన్ని విభాగాలు నడుస్తోన్న బేగంపేట మెట్రో రైల్‌ భవన్‌లో ఓ ఉద్యోగికి కరోనా నిర్దారణ అయింది. దీంతో ఆ భవనంలోని ఓ అంతస్థు మొత్తం ఖాళీ చేయించారు. ఇటీవలే సీఎంవోలో పనిచేస్తున్న ఉద్యోగి కుమారుడు ముంబయి నుంచి రావడం వల్ల అతని నుంచి తండ్రికి కరోనా సోకినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో ఇక్కడ పనిచేస్తున్న పలు శాఖల అధికారులు, సిబ్బంది 30మందిని క్వారంటైన్​కు పంపారు. అనంతరం కార్యాలయాన్ని బల్దియా అధికారులు స్ప్సేయింగ్ చేశారు. ఓ ఉద్యోగికి కరోనా సోకడం వల్ల సీఎంవో కార్యాలయంలో ఆందోళన నెలకొంది.

పలువురికి కరోనా..

శివాజీ నగర్ బస్తీలో ఉంటున్న హాబీబ్ నగర్ పీఎస్​ ఎస్సైకి కరోనా పాజిటివ్ రావడం వల్ల ఆయన్ని గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యులను క్వారంటైన్​కు తరలించారు. ఎల్బీనగర్ నియోజకవర్గం వనస్థలిపురం డివిజన్ శ్రీ శ్రీనివాసపురం కాలనీలో ఓ వైద్యునికి కరోనా నిర్దారణ అయినట్లు అధికారులు వెల్లడించారు. అల్లాపూర్ డివిజన్ రాజీవ్ గాంధీ నగర్​లో ఇద్దరు వ్యక్తులకు కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. వైరస్ సోకిన వారిని గాంధీ హాస్పిటల్ కి తరలించగా.. కుటుంబ సభ్యులందరిని హోమ్ క్వారంటైన్​లో ఉంచారు.

అంబర్​పేట్​ నియోజకవర్గంలో ఐదుగురికి..

అంబర్ పేట్ నియోజికవర్గంలో ఇవాళ 5 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. బాగ్ అంబర్ పేట్​లో నివసిస్తూ ఉస్మానియా విశ్వవిద్యాలయం ఠాణాలో పనిచేస్తున్న ఓ కానిస్టేబుల్ పాజిటివ్ నిర్దారణ అయింది. గతంలో ఇక్కడే పనిచేస్తున్న మరో కానిస్టేబుల్​కు కరోనా సోకింది. అంబర్ పేట్​లోని బాపునగర్​లోని వృద్దుడికి పాజిటివ్​గా నిర్దారణ అయిన 24 గంటల్లో మృతి చెందినట్లు స్థానిక వైద్యాధికారులు వెల్లడించారు. బాగ్ అంబర్ పేట్​లోని డీడీ కాలనీలో ఒక వ్యక్తి కి కరోనా నిర్దారణ అయింది. పటేల్ నగర్​లోని కూరగాయల వ్యాపారం చేస్తున్న వ్యక్తికి ఆయన కుమారుడి నుంచి కరోనా సోకినట్లు అధికారులు వివరించారు.

ఇవీ చూడండి: కరోనా టెస్టులు చేయడంలో ప్రభుత్వం విఫలం: డీకే అరుణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.