ETV Bharat / state

భారీగా పడిపోయిన తిరుమలేశుడి ఆదాయం - లాక్​డౌన్​తో తితిదే ఖజానాకు గండి

కరోనా ప్రభావం తితిదేపై తీవ్రంగా పడింది. భక్తుల కానుకలు, వసతి గదుల అద్దె, లడ్డూ విక్రయాలు లేకపోవటం వల్ల తిరుమలేశుడి ఖజానా గాడి తప్పుతోంది. లాక్​డౌన్ ఇంకొన్ని రోజులు కొనసాగితే సిబ్బంది జీతాలకు గండి పడే అవకాశం లేకపోలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

corona-effect-on-ttd
భారీగా పడిపోయిన తిరుమలేశుడి ఆదాయం
author img

By

Published : May 12, 2020, 8:43 AM IST

ప్రపంచంలోనే ప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంపై కరోనా ప్రభావం తీవ్రంగా పడింది. భక్తుల కానుకలతోపాటు వసతి గదుల అద్దె, లడ్డూ విక్రయాలు, ఆర్జిత సేవల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకునే దేవస్థానం ఖజానా.. 50 రోజులుగా వెలవెలబోతోంది. భక్తులకు శ్రీవారి ఆలయ ప్రవేశంపై నిషేధం కొనసాగిస్తుండటంతో.. కానుకలు రాక ఆర్థికంగా భారీ లోటు కన్పిస్తోంది. ప్రస్తుతానికి పాత విధానంలోనే ఉద్యోగులకు వేతనాలు చెల్లిస్తున్నప్పటికీ.. భక్తుల ప్రవేశంపై నిషేధం ఇంకొన్నాళ్లు కొనసాగితే సిబ్బంది జీతాలకూ ఇబ్బందులు తప్పకపోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

జీతాలు ఇచ్చేది ఇలా...

తితిదే 2020-21 వార్షిక బడ్జెట్‌ రూ.3309.89 కోట్లకు పాలకమండలి ఆమోదముద్ర వేసింది. ఇందులో సింహభాగం రూ.1385.09 కోట్లు ఉద్యోగుల జీతభత్యాలకే కేటాయించింది. ప్రస్తుతం దేవస్థానంలో మొత్తం 7400 మంది రెగ్యులర్‌, 14వేల మంది ఒప్పంద, పొరుగుసేవల సిబ్బంది పనిచేస్తున్నారు. వీరి జీతభత్యాలకే నెలకు సుమారు రూ.115 కోట్లు చెల్లిస్తోంది.

తలకిందులైన అంచనాలు..

మార్చి 20న ఆలయానికి భక్తుల ప్రవేశాన్ని నిషేధించగా.. అప్పటి నుంచి ఆదాయం పూర్తిగా పడిపోయింది. ఈ ఆర్థిక సంవత్సరంలో హుండీ ద్వారా రూ.1351 కోట్లు వస్తుందని అంచనా వేశారు. అంటే రోజుకు సగటున రూ.3.70 కోట్లు.. మార్చి 20నుంచి 50 రోజులకు సుమారు రూ.185 కోట్ల మేరకు హుండీ ఆదాయం కోల్పోయినట్లైంది. దాతల విరాళాల రూపేణా మరో రూ.15 కోట్ల మేరకు కోతపడింది. గదుల అద్దె, ఆర్జిత సేవలు, లడ్డూ ప్రసాద విక్రయం తదితరాలూ లెక్కిస్తే మొత్తంగా తితిదే సుమారు రూ.200 కోట్ల మేరకు ఆదాయాన్ని కోల్పోయింది.

స్వామి వారి దర్శనం ఎప్పుడో?

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయంలోకి భక్తులను ఎప్పటి నుంచి అనుమతిస్తారో ఇంకా స్పష్టత లేదు. లాక్‌డౌన్‌ అనంతరం అనుమతి ఇచ్చినా.. గతంలో మాదిరిగా పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చేందుకు మరింత సమయం పడుతుందని అధికారులు భావిస్తున్నారు. కొద్ది నెలలపాటు భక్తులకు దర్శనం కల్పించే విషయమై ఆంక్షలు విధించే ఆస్కారం ఉందని సంకేతాలు వస్తున్నాయి. స్వయంగా తితిదే ఛైర్మన్‌ సుబ్బారెడ్డి ఇటీవల మాట్లాడుతూ.. భక్తులు భౌతిక దూరం పాటించేలా, శానిటైజర్ల ద్వారా నిరంతరం శుభ్రం చేసుకునేలా పలు చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ఆర్జిత సేవలు, ప్రసాదాల విక్రయాలు, దర్శన టికెట్ల విక్రయాల ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ.702 కోట్లు వస్తాయని అంచనా వేశారు. ఇందులో సైతం కోత పడే ఆస్కారం ఉందని చెబుతున్నారు. ఈ తరుణంలో సిబ్బందికి జీతభత్యాలు చెల్లించడానికి ఇప్పటికిప్పుడు ఇబ్బంది లేకున్నా మున్ముందు సమస్య ఎదురవుతాయనే వాదనలు వినిపిస్తున్నాయి.

ఇప్పటికే కోత అమలు

తిరుమలేశుడి పేరిట వివిధ బ్యాంకుల్లో సుమారు రూ.13వేల కోట్ల వరకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు ఉన్నాయి. దీనిపై ఈ ఏడాది రూ.706 కోట్ల వడ్డీ వస్తుందని అంచనా. లాక్‌డౌన్‌ ప్రకటించాక మార్చి, ఏప్రిల్‌ నెలల వేతనాల చెల్లింపుపై రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు తితిదే సైతం ఉన్నతాధికారుల వేతనాల్లో 60శాతం, ఉద్యోగులకు 50 శాతం, ఒప్పంద ఉద్యోగులకు 10 శాతం కోత విధించింది. అయితే ఈ సొమ్మును భవిష్యత్తులో చెల్లిస్తామని చెబుతోంది. భవిష్యత్తులో ఆదాయం తగ్గితే ఈ బకాయిల చెల్లింపు ఎలాగన్నది పెద్ద ప్రశ్న.

ప్రస్తుతం నిర్వహణ ఖర్చులు తగ్గించారు. భక్తులు లేని కారణంగా అన్నప్రసాద వితరణ, పారిశుద్ధ్య నిర్వహణ, రవాణా, విద్యుత్తు వినియోగం తగ్గి.. ఆ మేరకు ఖర్చులు ఆదా అయ్యాయి. ఇది కొంత ఉపశమనం మాత్రమేనని, భక్తుల రాకపోకలు సాగి, శ్రీవారి దర్శన భాగ్యం జరగడంపైనే తితిదే ఆర్థిక పరిస్థితి ఆధారపడి ఉందని నిపుణులు చెబుతున్నారు.

ఇదీ చదవండి: శ్రీనివాసమంగాపురంలో స్వామివారి వసంతోత్సవాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.