ETV Bharat / state

లాక్​డౌన్​తో మూగజీవాలకు కష్టకాలం - lockdown

జనారణ్యంలో సంచరించే మూగజీవులు లాక్‌డౌన్‌తో బిక్కబిక్కుమంటూ కాలం వెల్లబుచ్చుతున్నాయి. కడుపునింపే నాధుడు లేక ఆకలితో అలమటిస్తున్నాయి. కరోనా పుణ్యమా అని మానవులకే కాదు మూగజీవులకు తీరని కష్టాలు వచ్చి పడ్డాయి. మూగజీవుల పొట్టనింపే ఆపన్నహస్తాలు కరోనా భయంతో కరవయ్యాయి. కొన్ని సంస్థలు, వ్యక్తులు ఉదార స్వభావంతో మూగజీవుల ఆకలి తీరుస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు.

corona effect on animals
లాక్​డౌన్​తో మూగజీవాలకు కష్టకాలం
author img

By

Published : Apr 3, 2020, 7:51 AM IST

కరోనా వ్యాప్తిని నివారించేందుకు దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ మానవాళికే కాదు మూగజీవులకు తీరని కష్టాలను తెచ్చిపెట్టింది. రోడ్లపై, నివాస సముదాయాల్లో తిరిగే మూగజీవులకు లాక్‌డౌన్‌ కారణంగా ఆహారం దొరకడం లేదు. 21 రోజుల పాటు హోటళ్లు, రెస్టారెంట్లు, చాట్‌ బండార్స్‌ మూసివేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడంతో నిర్వాహకులు మూసివేశారు. కడుపు నింపే హోటళ్లు, రెస్టారెంట్లు, దుకాణ సముదాయాలు, చికెన్‌, మటన్‌ కేంద్రాలు తెరవకపోవడం వల్ల మూగ జీవాలకు ఆహారం దొరకడం లేదు. మరీ ముఖ్యంగా శునకాల పరిస్థితి దారుణంగా తయారైంది.

పక్షులకు, జంతువులకు రోజు ఆహారాన్ని అందించే ప్రకృతి ప్రేమికులు కరోనా భయంతో బయటకు రావడం లేదు. దీంతో రోజు ఆహారమందించే వాళ్ల కోసం పావురాలు, శునకాలు ధీనంగా ఎదురు చేస్తున్నాయి. నగరంలోని చాలా ప్రాంతాల్లోని శునకాలు ఆకలితో అలమటిస్తున్నాయి. మరో వైపు వేసవికాలం కావడం వల్ల వాటి పరిస్థితి దయనీయంగా తయారైంది. జన సంచారం లేకపోవడం... నిత్యావసర సరుకులు తీసుకుని వెళ్తున్న వారి చేతుల్లోని సామాగ్రిని లాగేసుకుంటున్నాయి.

కొన్ని స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులు కరోనాను కూడా లెక్క చేయకుండా మూగజీవుల కడుపు నింపుతున్నారు. హెల్పింగ్‌ హ్యాండ్స్‌, బ్లెడ్‌గ్రూపింగ్‌, ఫుడ్‌ ఫౌండేషన్‌ నిర్వాహకుడు ఆర్య వంశీ బోయినిపల్లి, తాడ్‌బండ్‌ ఏరియాలోని శునకాలకు రోజు మధ్యాహ్నం సమయాల్లో ఆహారాన్ని అందిస్తున్నాడు. అమీర్‌పేటకు చెందిన వర్థని గత సంవత్సన్నర కాలంగా అమీర్‌పేట, పంజాగుట్ట ప్రాంతాల్లోని శునకాలకు రాత్రి వేళల్లో ఆహారాన్ని పెడుతోంది. 15 నుంచి 20 శునకాలకు ప్రతి రోజు ఇంట్లోనే వండుకోని ద్విచక్ర వాహనంపై వెళ్లి వాటికి వడ్డిస్తోంది.

లాక్​డౌన్​తో మూగజీవాలకు కష్టకాలం

ఇవీ చూడండి: మర్కజ్ కేసుల కోసం ప్రత్యేక ప్రోటోకాల్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.