భాగ్యనగరంలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. జంట నగరాల్లో ఆదివారం కూడా కరోనా కేసులు భారీగా నమోదయ్యాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 41మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. నియోజకవర్గ పరిధిలోని యూసుఫ్ గూడలో 13, బోరబండలో 8, ఎర్రగడ్డలో 8, వెంగళరావు నగర్లో 7, రహమత్ నగర్లో 5 కరోనా కేసులు నమోదయ్యాయి. కూకట్పల్లి సర్కిల్ పరిధిలో మొత్తం 33 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో మూసాపేట్ సర్కిల్లో 20, కూకట్పల్లి ఏరియాలో 13 కేసులు నమోదయినట్లు అధికారులు వెల్లడించారు.
అంబర్ పేట నియోజకవర్గ పరిధిలో 39 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో కాచిగూడ డివిజన్ పరిధిలో 25, అంబర్ పేట్ డివిజనల్ పరిధిలో 8, నల్లకుంట డివిజన్ పరిధిలో 6 కేసులు నమోదయ్యాయి. మరోవైపు పాజిటివ్ వచ్చి హోం ఐసోలేషన్ లో ఉంటున్న వారికి కిట్లు అందించడంలో జీహెచ్ఎంసీ అధికారులు ఆలస్యం చేస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి : దుర్గామాతకు బోనాలు సమర్పించిన మంత్రి అల్లోల