ఆంధ్రప్రదేశ్లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. గత కొద్ది రోజులుగా ఆ రాష్ట్రంలో కొవిడ్ బారిన పడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తోంది. గడిచిన 24 గంటల్లో 40,604 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 984 కేసులు నిర్ధరణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు ఏపీలో 8,96,863 మంది వైరస్ బారినపడినట్లు ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
చిత్తూరు, విశాఖ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోవడంతో ఏపీ వ్యాప్తంగా మృతుల సంఖ్య 7,203కు చేరింది. 24 గంటల వ్యవధిలో 306 మంది బాధితులు పూర్తిగా కోలుకున్నారు. ప్రస్తుతం ఏపీలో 4,145 యాక్టివ్ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటివరకు ఆ రాష్ట్రవ్యాప్తంగా 1,49,16,201 కరోనా నమూనాలను పరీక్షించినట్లు వెల్లడించింది. అత్యధికంగా చిత్తూరులో 163.. అత్యల్పంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 12 కేసులు నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో నాలుగు జిల్లాల్లో వందకుపైగా కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.
జిల్లాల వారీగా కేసుల వివరాలను పరిశీలిస్తే..