ETV Bharat / state

Corona Effect: మూతపడిన కోట... మూగబోయిన మాట! - telangana tourism 2021

తెలంగాణలో పర్యాటక రంగం ఘోరంగా దెబ్బతిన్నది. లక్షల మంది ఉపాధిపై కరోనా పంజా విసిరింది. గోల్కొండ నుంచి బొగత దాకా అదే స్థితి నెలకొంది.

telangana tourism
మూతపడిన కోట... మూగబోయిన మాట!
author img

By

Published : Jun 7, 2021, 9:30 AM IST

  • అది గోల్కొండ కోట ముందర.. దాదాపు 30 మందికిపైగా రోజూ వస్తుంటారు. సందర్శకుల్ని అనుమతించే రోజు ఎప్పుడు వస్తుందా? అని ఆ కోట వైపు ఆశగా చూస్తుంటారు. కొద్దిసేపు అక్కడ కూర్చుని.. మాటముచ్చట్లు చెప్పుకుని, నిరాశతో వెనుదిరుగుతారు. వీరు గోల్కొండ చరిత్రను కళ్లకు కట్టినట్లు వివరించే గైడ్లు. చారిత్రక కోట అందాల్ని వీక్షించేందుకు వచ్చే పర్యాటకులకు అక్కడి విశేషాలు చెప్పి ఉపాధి పొందే వీరిని కరోనా మహమ్మారి ఒకరి కన్నీటి కష్టాలు మరొకరు చెప్పుకునే స్థితికి తీసుకొచ్చింది..
  • ఇక్కడ ఒక్కచోట మాత్రమే కాదు రాష్ట్రవ్యాప్తంగా అనేక పర్యాటక ప్రదేశాల్లో, ఈ రంగంపై ఆధారపడి ఉపాధి పొందుతున్న వేలాది మందిది ఇంచుమించు ఇదే పరిస్థితి. కరోనా దెబ్బతో అత్యధికంగా దెబ్బతిన్నది పర్యాటక రంగమే. గత ఏడాది తీవ్రంగా దెబ్బతిని కొద్దినెలలుగా క్రమక్రమంగా కోలుకుంటున్న ఈ రంగాన్ని రెండో దశ తీవ్రంగా దెబ్బతీసింది.
.

గోల్కొండ కోట, ఛార్మినార్‌, బొగత జలపాతం, లక్నవరం చెరువు, కాళేశ్వరం ప్రాజెక్టు, నల్లమల అందాలు.. ఇలా రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాలకు కొదవలేదు. అయితే కొవిడ్‌ నేపథ్యంలో ప్రకృతి, ఆధ్యాత్మిక పర్యాటక ప్రాంతాలు, చారిత్రక కట్టడాల సందర్శనను నిలిపివేయడంతో వాటిపై ఆధారపడి జీవించే ఫొటోగ్రాఫర్లు, గైడ్లు, శిక్షకులు, టూర్స్‌ట్రావెల్స్‌ ఏజెంట్లు, అందులో పనిచేసే సిబ్బంది, వాహన డ్రైవర్లు.. పరోక్షంగా ఈ రంగంపై ఆధారపడి ఉపాధి పొందే ఆటోడ్రైవర్లు, లాడ్జిల యజమానులు, సిబ్బంది, చిన్నదుకాణాలవారు వ్యాపారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా టూరిజం ఆపరేటర్లు, ఏజెంట్లపై తీవ్ర ప్రభావం ఉంది. ‘ఆఫీˆసుల అద్దె, ఉద్యోగుల జీతాలు ఇవ్వలేక కొందరు ఆపరేటర్లు ఈ రంగం నుంచి వైదొలిగారు. ఏజెంట్లు ప్రత్యామ్నాయ ఉపాధి చూసుకుంటున్నారు. తీవ్రమైన గడ్డు పరిస్థితిని పర్యాటక రంగం ఎదుర్కొంటోంది’ అని ఓ ప్రముఖ టూర్‌ ఆపరేటర్‌ ఆవేదన వ్యక్తంచేశారు. ఉపాధి పొందుతున్నవారిలో కొందరు ఆదాయంలేక గ్రామాలకు వెళ్లి వ్యవసాయ, కూలి పనులు చేసుకుంటున్నారు. మరికొందరు ప్రత్యామ్నాయాలు లేక, ఇతర పనులు చేయలేక రోజులు భారంగా గడుపుతున్నారు. బొగత జలపాతం సందర్శకుల రక్షణకు అటవీశాఖ 16 మంది రక్షణ సిబ్బందిని పెట్టింది. రోజుకు రూ.300 వేతనం.నెలకు రూ.9 వేల వేతనంతో ఆ కుటుంబాలకు ఆసరాగా ఉండేది. ఐదేళ్లుగా పనిచేస్తున్న వారిని అటవీశాఖ మే నెల నుంచి తాత్కాలికంగా తొలగించింది. కారణం.. కరోనా ప్రభావం. జలపాతం సందర్శనను అటవీశాఖ మూసివేసింది. దీంతో పూటగడవడం కష్టంగా ఉందని ఆ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ములుగుజిల్లా రామప్ప ఆలయానికి వచ్చే ఆధ్యాత్మిక పర్యాటకులపై కరోనా ప్రభావం అక్కడి 32 దుకాణాలు, గైడ్లపై పడింది. ఓ గైడ్‌ తన కుల వృత్తి అయిన చేపలవేటకు వెళుతున్నాడు.

చాలా కష్టాలు పడుతున్నాం

'45 ఏళ్లుగా గోల్కొండ కోటలో గైడ్‌గా పనిచేస్తున్నా. గతేడాది నాలుగైదు నెలలు ఇబ్బంది పడ్డా. కొద్దికొద్దిగా పరిస్థితి మెరుగుపడుతోంది అనుకున్న సమయంలో సెకండ్‌వేవ్‌. ఆరువారాల నుంచి కోటను మూసేశారు. మరో పనిలేదు. చాలా కష్టాలు పడుతున్నాం. నాతో పనిచేసేవారిదీ ఇదే పరిస్థితి. బంధువులు, తెలిసిన మిత్రుల నుంచి కొంత సాయం అందుతోంది.'- సిరాజుద్దీన్‌, గైడ్‌, హైదరాబాద్‌

కూలి పనులకు వెళుతున్నా

'బొమ్మల దుకాణం ఉంది. పర్యాటకులు రోజుకు రూ.3,500 కొనుగోళ్లు చేసేవారు. కరోనాతో వ్యాపారం బంద్‌. కుటుంబం గడిచేందుకు కూలి పనులకు వెళుతున్నా.' - తడక మురళి,పాలంపేట, ములుగు జిల్లా

ఏం చేయాలో తోచడం లేదు

'పర్యాటకుల్ని ఫొటోలు తీయడంతో మంచి ఆదాయం వచ్చేది. గతేడాది పాలకుర్తి మండంలోని మా ఊరెళ్లి వ్యవసాయం చేసుకున్నా. తిరిగివచ్చా. ఇప్పుడేం చేయాలో తోచడం లేదు. లాక్‌డౌన్‌తో ఆర్థికంగా చితికిపోయా.' - సురేష్‌, ఫొటోగ్రాఫర్‌, హైదరాబాద్‌

పూట గడవడం కష్టంగా ఉంది
'బొగత జలపాతం వద్ద రక్షణ సిబ్బందిగా ఐదేళ్లుగా పనిచేస్తున్నా. ఏడాదిలో పర్యాటకులు లేని సమయంలో మిగతా పనులు అప్పజెప్పేవారు. కొవిడ్‌ కారణంగా జలపాతానికి సందర్శకుల్ని అనుమతించడం లేదు. నా ఉపాధి పోయింది. పూట గడవడం కష్టంగా ఉంది.' - గొంది బాలకృష్ణ, వాజేడు, ములుగు జిల్లా

ఇదీ చదవండి: కొవిడ్​ నుంచి కోలుకున్న వారిలో కొత్త రకం వ్యాధి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.