ETV Bharat / state

కుటుంబ కలహాలతో కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం - Hyderabad Chaitanyapuri Latest News

ఓ కానిస్టేబుల్​ తానూ చనిపోతున్నానని పోలీస్​ స్టేషన్​కి కాల్​ చేసి ఫోన్​ పేట్టేశాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అతని జాడ కోసం వెతికి పట్టుకున్నారు. కానీ అప్పటికే ఆ కానిస్టేబుల్​ పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ఈ ఘటన హైదరాబాద్​ చైతన్యపురిలో జరిగింది.

constable called the police station and told them suicide news in hyderabad
పోలీస్​ స్టేషన్​కి కాల్​ చేసి ఆ వార్త చెప్పేశాడు
author img

By

Published : Nov 13, 2020, 10:00 AM IST

హైదరాబాద్​లో కుటుంబ కలహాలతో ఓ పోలీస్​ కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. చైతన్యపురి పోలీస్​స్టేషన్​లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ నరేష్ గురువారం రాత్రి విధులు ముగించుకుని.. హాయత్​నగర్​లోని తన ఇంటికి వెళ్తున్నాని చెప్పాడు.

అనంతరం పోలీస్​​స్టేషన్​కు ఫోన్ చేసి తనకు కుటుంబ సమస్యలు ఉన్నానంటూ.. చనిపోతున్నానని చెప్పి ఫోన్ పెట్టేశాడు. దీంతో నరేష్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి... గడ్డి అన్నారం ఫ్రూట్ మార్కెట్​లో ఉన్నట్లుగా గుర్తించారు. నరేష్​ అప్పటికే పురుగుల మందు తాగి స్పృహ కోల్పోయినట్లు పోలీసులు గమనించారు. చికిత్స నిమిత్తం హుటాహుటిన కొత్తపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.

నరేష్​, అతని భార్యకు కొన్ని నెలలుగా వివాదాలు తలెత్తుతున్నాయని.. వారికి ఓ కుమారుడు, కూతురు ఉన్నారని పోలీసులు పేర్కొన్నారు. ప్రస్తుతం తానూ ఒంటరిగా ఉంటూ జీవనం సాగిస్తున్నాడని అన్నారు. ఇటీవలే చైతన్యపురి పీఎస్​కు బదిలీపై వచ్చాడని, విధుల్లో చురుగ్గా ఉండేవాడిని పోలీసులు వెల్లడించారు. ఆస్పత్రిలో ఉన్న కానిస్టేబుల్ పరిస్థితి విషమంగా ఉందని.. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసులు వివరించారు.

ఇదీ చూడండి : ప్రేమికుడే హంతకుడా... అత్యాచారం జరిగిందా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.