ETV Bharat / state

'కేసీఆర్‌కు సచివాలయం మీదున్న శ్రద్ధ ఉస్మానియా ఆస్పత్రి మీద లేదు' - ఉస్మానియా ఆస్పత్రిని సందర్శించిన వీహెచ్

హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రిని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ సందర్శించారు. పాత సూపరింటెండెంట్ ఆఫీస్ ముందు మెట్లపై కూర్చోని నిరసన వ్యక్తం చేశారు. కేసీఆర్‌కు సచివాలయం మీదున్న శ్రద్ధ ఉస్మానియా మీద లేదన్నారు. ఆస్పత్రి డిజైన్ ఎందుకు విడుదల చేయడం లేదని ప్రశ్నించారు.

vh
vh
author img

By

Published : Jul 28, 2020, 4:50 PM IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సచివాలయం మీదున్న శ్రద్ధ ఉస్మానియా ఆస్పత్రి మీద లేదని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ అన్నారు. కేసీఆర్‌ సీఎం అయ్యాక ఆస్పత్రిని సందర్శించి... నూతన భవనం కట్టిస్తానని హామీ ఇచ్చి విస్మరించారని ఆరోపించారు. కాంగ్రెస్ వల్లే కొత్త భవనం కట్టలేదని అబద్ధాలు చెబుతున్నారన్నారు. ఆస్పత్రిని సందర్శించిన వీహెచ్.. ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాత సూపరింటెండెంట్ ఆఫీస్ ముందు మెట్లపై కూర్చోని నిరసన వ్యక్తం చేశారు.

హెరిటేజ్ భవనాన్ని కూల్చాల్సిన అవసరం లేదని... మరమ్మతులు చేయించాలని వీహెచ్ సూచించారు. పక్కనున్న ఖాళీ స్థలంలో కొత్త భవనం నిర్మించాలని డిమాండ్ చేశారు. ఆస్పత్రి డిజైన్ ఎందుకు విడుదల చేయడం లేదని ప్రశ్నించారు. ఎన్ని కోట్లతో ఆస్పత్రి నిర్మిస్తారో ఎందుకు చెప్పడం లేదని నిలదీశారు. భవనాన్ని ఎప్పుడు నిర్మిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాంపల్లి కాంగ్రెస్ ఇంఛార్జ్ ఫిరోజ్ ఖాన్, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇవీ చూడండి: కరోనా కేసులపై హైకోర్టు విచారణ ఆగస్టు 13కి వాయిదా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.