ETV Bharat / state

రైతులకు మద్దతుగా దిల్లీ వెళ్లి దీక్షలో పాల్గొంటా: వీహెచ్​ - రైతుల నిరసనకు వీహెచ్​ మద్దతు

దేశంలో సాగు చట్టాలను నిరసిస్తూ రైతులు చేస్తున్న ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నట్లు కాంగ్రెస్​ సీనియర్​ నేత వి.హనుమంతరావు అన్నారు. దిల్లీ వెళ్లి రైతుల దీక్షలో కూర్చుంటానని తెలిపారు. ఇందిరా పార్క్ వద్ద అఖిల పక్ష రైతు సంఘాల ఆధ్వర్యంలో మూడో రోజు జరిగిన రిలే నిరాహార దీక్షలో ఆయన పాల్గొన్నారు.

రైతుల ఉద్యమానికి నా సంపూర్ణ మద్దతు... దీల్లీ వెళ్లి దీక్షలో పాల్గొంటా: వీహెచ్​

author img

By

Published : Dec 16, 2020, 3:47 PM IST

Updated : Dec 16, 2020, 9:58 PM IST

కేంద్ర వ్యవసాయ చట్టాలు, విద్యుత్ సవరణల బిల్లు రద్దు చేసుకోవాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్​ ఇందిరాపార్క్​ వద్ద రైతు సంఘాలు చేస్తున్న రిలే నిరాహారదీక్షకు వి.హనుమంతరావు మద్దతు తెలిపారు. రైతుల దీక్షకు మద్దతుగా దిల్లీ వెళ్లి దీక్షలో పాల్గొంటానని వీహెచ్​ అన్నారు.

రైతులకు మద్దతుగా దిల్లీ వెళ్లి దీక్షలో పాల్గొంటా: వీహెచ్​

దేశ చరిత్రలోనే దిల్లీలో వినూత్న రీతిలో సాగుతున్న రైతు ఉద్యమానికి... రాజకీయాలకు అతీతంగా కాంగ్రెస్‌ సంపూర్ణ మద్దతుతో పాటు ఆందోళనల్లో భాగస్వామ్యమైందని వీహెచ్‌ ప్రకటించారు. ఇప్పటికే ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీ సహా వామపక్ష నేతలు సీతారాం ఏచూరి, రాజా... ఉద్యమానికి తోడుగా ఉన్నారని తెలిపారు. రైతు సంక్షేమం, లాభదాయమైన ఉత్తమ చట్టాలు అంటున్న ప్రధాని మోదీ... అదే నిజమైతే దిల్లీసహా దేశవ్యాప్తంగా రైతులు రోడ్లపైకి వచ్చి ఎందుకు నిరసన చేస్తారని ప్రశ్నించారు.

సాగు చట్టాలు రద్దుచేసి గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం తొలిగించేందుకు వ్యవసాయ రంగం, రైతులను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే నంద్యాల నరసింహారెడ్డి అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నంద్యాల నరసింహారెడ్డి, తెలంగాణ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి తీగల సాగర్, మహిళా సంఘాల నేతలు రమా మేల్కొటే, రైతు స్వరాజ్య వేదిక ప్రతినిధులు కన్నెగంటి రవి, బి.కొండల్‌రెడ్డి, రైతుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: కొనేది కేంద్రం... ప్రచారం రాష్ట్ర ప్రభుత్వానిది : మురళీధర్ రావు

Last Updated : Dec 16, 2020, 9:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.