ఏఐసీసీ పిలుపు మేరకు టీపీపీసీ... ఇవాళ రాజ్‌భవన్ ఘెరావ్ చేపట్టనుంది. ఉదయం 11 గంటలకు హైదరాబాద్ లుంబినీ పార్కు వద్ద కాంగ్రెస్ శ్రేణులు, నాయకులు సమవేశమై అక్కడ నుంచి రాజ్‌భవన్ వరకు ర్యాలీగా వెళ్లనున్నారు. కేంద్రం తెచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ శివార్లలో ఉద్యమం చేస్తున్న రైతులకు మద్దతుగా, పెరుగుతున్న పెట్రోల్, డీజిల్, నిత్యావసర సరుకుల ధరలకు నిరసనగా ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్ తెలిపారు.
రాజ్‌భవన్ వరకు ర్యాలీగా వెళ్లి గవర్నర్‌ను కలిసి వినతి పత్రం అందిస్తామని చెప్పారు. రాజ్‌భవన్ వరకు ర్యాలీకి ఎలాంటి అనుమతులు ఇవ్వనందున ఎక్కడికక్కడ కాంగ్రెస్ ముఖ్య నాయకులని ముందస్తు అరెస్టులు చేసేందుకు, గృహనిర్బంధంలో ఉంచేందుకు పోలీసు శాఖ సమాయత్తమైనట్లు తెలుస్తోంది. రాజ్‌భవన్‌కు వచ్చే మార్గాలన్నింటిపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు.
ఇదీ చదవండి: రెండో రోజు 335 కేంద్రాల్లో కరోనా వ్యాక్సినేషన్