ETV Bharat / state

Lakhimpur incident : లఖింపూర్​ ఘటనకు నిరసనగా.. ఇందిరాపార్కు వద్ద కాంగ్రెస్​ మౌనదీక్ష - కాంగ్రెస్​ మౌన దీక్ష

లఖింపూర్​ ఘటన పట్ల నిరసన వ్యక్తం చేస్తూ కాంగ్రెస్​ నేతలు(Congress protest against Lakhimpur incident) మౌన దీక్ష చేపట్టారు. సాగుచట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రైతులపై జరిగిన దాడికి నిరసనగా ఏఐసీసీ దేశవ్యాప్త నిరసనలుచేపట్టింది. ఇందులో భాగంగా హైదరాబాద్​ ఇందిరాపార్కు వద్ద చేపట్టిన దీక్షలో పార్టీ నేతలు రేవంత్​ రెడ్డి, భట్టి విక్రమార్క తదితరులు పాల్గొన్నారు.

Congress protest against Lakhimpur incident
కాంగ్రెస్​ మౌన దీక్ష
author img

By

Published : Oct 11, 2021, 12:30 PM IST

Updated : Oct 11, 2021, 12:55 PM IST

లఖింపుర్​ ఖేరి హింసాత్మక ఘటన(Congress protest against Lakhimpur incident)కు వ్యతిరేకంగా హైదరాబాద్​ ఇందిరాపార్కు వద్ద టీపీసీసీ ఆధ్వర్యంలో మౌన దీక్ష చేపట్టారు. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్‌ మిశ్రా కుమారుడు తన కారుతో రైతులను తొక్కించిన సంఘటనపై.. ఏఐసీసీ దేశవ్యాప్త మౌన దీక్ష నిరసనలో భాగంగా రాష్ట్ర కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. కేంద్ర మంత్రి అజయ్​ మిశ్రాను పదవి నుంచి తొలగించాలని డిమాండ్​ చేస్తూ.. నిరసన చేపట్టారు.

దీక్ష(Congress protest against Lakhimpur incident)లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ, పీఏసీ కమిటీ కన్వీనర్ షబ్బీర్​ అలీ, హైదరాబాద్ పార్లమెంట్ ఇన్​ఛార్జ్ ఫిరోజ్ ఖాన్, యువజన కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి అనిల్ యాదవ్​, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్​ కుమార్ గౌడ్, పార్టీ నేతలు మహేశ్వర్ రెడ్డి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావ్ తదితరులు పాల్గొన్నారు.

ఇందిరాపార్కు వద్ద కాంగ్రెస్​ మౌనదీక్ష

అసలేం జరిగింది..

అక్టోబరు 3న ఉత్తర్​ప్రదేశ్​ లఖింపుర్​ ఖేరీలో(Congress protest against Lakhimpur incident) ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య పర్యటన నేపథ్యంలో ఆ ప్రాంతంలో హింస చెలరేగింది. లఖింపుర్‌ ఖేరీ జిల్లా టికునియా-బన్​బీర్​పుర్​ సరిహద్దు వద్ద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తున్న రైతులు, అధికార వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. రైతులపైకి కేంద్ర మంత్రి అజయ్ మిశ్ర కుమారుడి వాహనం దూసుకెళ్లింది. ప్లకార్డులు, బ్యానర్లు చేతపట్టుకొని నిరసన చేస్తున్న అన్నదాతలపైకి ఓ వాహనం వేగంగా దూసుకువచ్చింది.

ఘర్షణలో(Congress protest against Lakhimpur incident) మొత్తం ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో నలుగురు రైతులు, ఓ పాత్రికేయుడు, ఇద్దరు భాజపా సభ్యులు, కారు డ్రైవర్​ ఉన్నారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.45 లక్షల చొప్పున యూపీ ప్రభుత్వం పరిహారం అందించింది.

ఇదీ చదవండి: Koppula eswar on etela: 'ఏడేళ్ల కాలంలో భాజపా ఏం చేసింది?'

Last Updated : Oct 11, 2021, 12:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.