ETV Bharat / state

ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించింది.. కాంగ్రెస్​ పార్టీనే: రేవంత్​ రెడ్డి - కాంగ్రెస్​ ఆధ్వర్యంలో ఇఫ్తార్​ విందు

Congress Party Arranged An Iftar Dinner: కాంగ్రెస్​ పార్టీ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు.. ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. పవిత్ర రంజాన్​ మాసం సందర్భంగా నిర్వహించిన ఈ విందులో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జి మాణిక్​రావు ఠాక్రే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి పాల్గొన్నారు. ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించిన పార్టీ కాంగ్రెస్​ అని రేవంత్​రెడ్డి వ్యాఖ్యానించారు.

revanth reddy
revanth reddy
author img

By

Published : Apr 7, 2023, 10:28 PM IST

Congress Party Arranged An Iftar Dinner: సచార్​ కమిటీ నివేదిక ఆధారంగా ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లను కల్పించిన పార్టీ కాంగ్రెస్​ అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి పేర్కొన్నారు. ఆ కమిటీ రిజర్వేషన్లను కల్పించడంతోనే విద్య, ఉద్యోగాలలో ముస్లింలు ఎంతో అభివృద్ధి సాధించారని అన్నారు. హైదరాబాద్​లోని పాతబస్తీలో కులీకుతుబ్​ షా మైదానంలో టీపీసీసీ ఏర్పాటు చేసిన ఇఫ్తార్​ విందుకు ఏఐసీసీ రాష్ట్ర ఇన్​ఛార్జి మాణిక్​రావు ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి మాట్లాడారు. ముందుగా ముస్లిం సోదరులు అందరికీ రంజాన్​ శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్​, ఎంఐఎం పార్టీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇక్కడ ఉన్న నాయకుడు కారు స్టీరింగ్​ తమ చేతిలో ఉందని భ్రమ పడుతున్నారు.. కానీ ఆ స్టీరింగ్​ కారులో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ గల్లీలో చేరాడని ఎద్దేవా రేవంత్​రెడ్డి ఎద్దేవా చేశారు. ఇక్కడ ఉన్న ముస్లింలకు ఎంఐఎం నాయకులు న్యాయం చేయని విషయాన్ని గమనించాలని.. ముస్లింల అభివృద్ధి, సంక్షేమం కాంగ్రెస్​ పార్టీ చూసుకుంటుందని వారికి భరోసా ఇచ్చారు. రంజాన్​ పండుగ సందర్భంగా రేవంత్​ రెడ్డి ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఇప్తార్​ విందు కార్యక్రమంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి థారిక్​ అన్వర్​, ఏఐసీసీ మైనార్టీ సెల్​ ఛైర్మన్​, ఎంపీ ఇమ్రాన్​ ప్రతాప్​ ఘడి, టీపీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ అజారుద్దీన్​, ఏఐసీసీ కార్యదర్శులు నదీమ్​ జావిద్​, రోహిత్​ చౌదరీ, చిన్నారెడ్డి, మాజీ మంత్రి షబ్బీర్​ అలీ, మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, వి. హనుమంతరావు, ఆంధ్రప్రదేశ్​ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, వర్కింగ్​ ప్రెసిడెంట్స్​ అంజన్​ కుమార్​ యాదవ్​, మహేశ్​ గౌడ్​, మల్లు రవి, సమీర్​ ఉల్లా, రోహిన్​రెడ్డి, నిజాముద్దీన్​ తదితర నాయకులు పాల్గొన్నారు.

మళ్లీ మొదలు కానున్న కాంగ్రెస్​ పార్టీ హాథ్​ సే హాథ్​ జోడో యాత్ర: మళ్లీ హాథ్​ సే హాథ్​ జోడో యాత్ర ఈ నెల 10 నుంచి ప్రారంభంకానుంది. జుక్కల్​లో ప్రారంభమైన యాత్ర ఈ నెల 25 వరకు కొనసాగనుంది. గజ్వేల్​లో ఈ నెల 25లోపు లక్ష మంది నిరుద్యోగులతో.. నిరుద్యోగ నిరసన సభ నిర్వహించనున్నారని కాంగ్రెస్​ శ్రేణులు తెలిపారు. మరోవైపు పేపర్​ లీకేజీ కేసులో మంత్రి కేటీఆర్​ను బర్తరఫ్​ చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు కొన్ని రోజుల క్రితం పేర్కొన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.