కాంగ్రెస్ 70 ఏళ్ల నుంచి దేశంలో సమన్యాయం కోసం పనిచేస్తోందని ఎంపీ సయ్యద్ నాసిర్ హుస్సేన్ అన్నారు. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా తెచ్చిన బిల్లును కాంగ్రెస్ వ్యతిరేకిస్తోందని తెలిపారు. పార్లమెంట్లో ఈ బిల్లుపై మరోసారి చర్చ జరగాలని డిమాండ్ చేశారు.
బడుగు వర్గాలు, మైనార్టీలకు భాజపా వ్యతిరేకమని అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జరుగుతున్న పరిణామాలే సాక్ష్యమని ఎంపీ హుస్సేన్ అన్నారు. దేశంలో ఉద్యోగ కల్పన లేదని, పరిశ్రమలు రావడం లేదని వీటిని పక్కదారి పట్టించేందుకు ఎన్ఆర్సీ, ఎన్సీఆర్పీ, రిజర్వేషన్ అంశాలను తెరపైకి తెచ్చిందని మండిపడ్డారు. ఉభయ సభల్లో రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ పోరాడుతోందని స్పష్టం చేశారు.
- ఇదీ చూడండి : 'రైల్వే మంత్రులు సొంత రాష్ట్రాలనే అభివృద్ధి చేసుకుంటున్నారు'