ఆర్టీసీ కార్మికుల కాలికి ముల్లుగుచ్చుకుంటే పంటితో తీస్తానన్న సీఎం ఇప్పుడు అణిచిచేస్తున్నారని మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. ఈనెల 21న ఛలో ప్రగతి భవన్ చేపడతామని తెలిపారు. మంత్రులు రెచ్చగొట్టడం వల్లే కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు. ఈ నెల 19న జరిగే రాష్ట్ర బంద్‌కు కాంగ్రెస్ పూర్తి మద్దతు ఇస్తుందని ప్రకటించారు.
ఇదీ చూడండి: 'కేకే మధ్యవర్తిత్వం వహిస్తే చర్చలకు సిద్ధం'