ETV Bharat / state

'సీఎంగా కేటీఆర్​ను తెరమీదకు తెచ్చేది అందుకే...' - MLC Jeevan Reddy SPEECH

ముఖ్యమంత్రి కేసీఆర్​పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి విరుచుకుపడ్డారు. కేసీఆర్​కు సాగు చట్టాల అమలుపై చూపించే శ్రద్ధ ప్రజా సమస్యలపై లేదని ఆరోపించారు. గత ఎన్నికల ఫలితాలతోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కనువిప్పు కలిగినందుకు సంతోషమన్నారు.

congress mlc jeevan reddy fires on cm kcr

author img

By

Published : Jan 22, 2021, 5:42 PM IST

తెరాస ప్రభుత్వం కేంద్ర వ్యవసాయ చట్టాలను అమలు చేయడంపై చూపించే శ్రద్ధ ప్రజా సమస్యలపై లేదని ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి ఆరోపించారు. ఆయుష్మాన్ భారత్ అమలుపై నిర్ణయం తీసుకోడానికి రెండేళ్ల సమయం పట్టిందని వెల్లడించారు. మొన్నటి వరకు ఆరోగ్యశ్రీ అంత కంటే మెరుగని చెప్పి కాలయాపన చేశారని విమర్శించారు.

ఎకనామికల్లీ వీకర్‌ సెక్షన్‌-ఈడబ్ల్యుఎస్‌ రిజర్వేషన్ల అమలు చేయడంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లు ఆలస్యం చేసిందని వెల్లడించారు. గత ఎన్నికల ఫలితాలతోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కనువిప్పు కలిగినందుకు సంతోషమన్నారు. గిరిజన రిజర్వేషన్లు 10 శాతం అమలు చేయడం లేదని, చరిత్రలో సీఎం కేసీఆర్ గిరిజన ద్రోహిగా మిగిలిపోతారని వ్యాఖ్యానించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ తనయుడు కేటిఆర్‌ను సీఎంను చేయకపోతే ఔరంగజేబు పాత్ర పోషించే అవకాశం ఉందని హెచ్చరించారు. కేసీఆర్‌కు వయస్సు మళ్లీందని...తెరాస నేతలే అంటున్నారని తెలిపారు. ఇందువల్లనే తెరాస నాయకులు ...కేటీఆర్‌ను తెరమీదకు తెచ్చారని పేర్కొన్నారు.

అందుకే సీఎంగా కేటీఆర్​ను తెరమీదకు తెచ్చారు: జీవన్​రెడ్డి

ఇదీ చదవండి: రుణమంతా చెల్లించినా.. వేధింపులు ఆపలేదు: డీసీపీ పద్మజ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.