కరోనా విషయంలో ప్రభుత్వం సరైన రీతిలో స్పందించకపోతే కాంగ్రెస్ పార్టీ పోరాటం చేయక తప్పదని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనాను గాలికొదిలేశారని దుయ్యబట్టారు. మంత్రులు చెరువుల్లో చేపలు వదలడం, మొక్కలు నాటడం వంటి పనుల్లో నిమగ్నమయ్యారని ఎద్దేవా చేశారు. ఓవైపు కరోనాతో ప్రజలు మృత్యవాత పడుతుంటే.. ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్, మంత్రులు సెక్రటేరియట్‌లో మరుగుదొడ్ల వాస్తుపై చర్చించడం ఏంటని ప్రశ్నించారు.
కరోనా విషయంలో ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతుంటే.. సీఎంకు చీమకుట్టినట్లు కూడా లేదని జగ్గారెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో వైరస్‌ను నివారించాల్సిన బాధ్యత ఆయనదేనని స్పష్టం చేశారు. ఇలాంటి సమయంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదన్న ఆయన.. ఇప్పటికైనా ప్రభుత్వం తగు చర్యలు చేపట్టాలని సూచించారు.
ఇదీచూడండి: 'కరోనా బాధితులకు చికిత్స అందించే బాధ్యత ప్రభుత్వానిదే'