ETV Bharat / state

'సీఎంను అరెస్ట్​ చేయిస్తామంటారు... కారణమేంటో చెప్పరు..' - జగ్గారెడ్డి కామెంట్స్

ముఖ్యమంత్రిపై తీవ్రస్థాయిలో భాజపా విమర్శలు చేస్తున్నా తెరాస నేతలు ఎందుకు సమాధానం ఇవ్వట్లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని ఆరోపించారు.

congress mla jagga reddy sensational comments on trs and bjp
'సీఎంను అరెస్ట్​ చేయిస్తామంటారు... కారణమేంటో చెప్పరు..'
author img

By

Published : Jan 21, 2021, 4:55 PM IST

తెరాస, ఎంఐఎం, భాజపా మూడు పార్టీలు ఒక్కటేనని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. ఉదయం అంతా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ... రాత్రికి అంతా ఒక గూటి దగ్గరకే చేరుకుంటారని వ్యాఖ్యానించారు. కేసీఆర్​ను జైల్లో పెడతామంటున్న బండి సంజయ్... దానికి గల కారణమేంటో ఎందుకు చెప్పట్లేదని ప్రశ్నించారు. రుణమాఫీ, ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతిపై ఎందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించట్లేదో భాజపా చెప్పాలన్నారు. సీఎం మార్పు వెనుక భాజపా ప్రమేయం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని జగ్గారెడ్డి ఆరోపించారు. సీఎం మార్పు అనేది కేసీఆర్ ఇంటి పంచాయతీగా మారిందని వ్యాఖ్యానించారు.

'సీఎంను అరెస్ట్​ చేయిస్తామంటారు... కారణమేంటో చెప్పరు..'

ఇదీ చూడండి: 'పార్టీ బలోపేతం కోసం నాయకులంతా కృషి చేయాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.