ETV Bharat / state

సచివాలయం పరిశీలించిన కాంగ్రెస్​ నేతలు - కాంగ్రెస్​ నేతల సచివాలయ సందర్శన

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నేతృత్వంలో సచివాలయం భవనాలు పరిశీలించేందుకు కాంగ్రెస్​ నేతలు సెక్రటేరియట్​కు చేరుకున్నారు. అయితే పోలీసులు కాంగ్రెస్​ సీనియర్​ నేత వీహెచ్​ను సచివాలయంలోకి కొంతసేపు అనుమతించలేదు. తర్వాత పోలీసులు వీహెచ్​ను లోనికి వదిలారు. సచివాలయ భవనాలు పూర్తిగా పరిశీలించి హస్తం నేతలు తమ వైఖరిని తెలియజేయనున్నారు.

కాంగ్రెస్​ నేతలు
author img

By

Published : Jul 1, 2019, 11:47 AM IST

Updated : Jul 1, 2019, 12:34 PM IST

సచివాలయం పరిశీలిస్తున్న కాంగ్రెస్​ నేతలు

సచివాలయ భవనాలను పరిశీలించేందుకు కాంగ్రెస్​ నేతలు, ఎమ్మెల్యేలు వచ్చారు. సీఎల్పీ భట్టి విక్రమార్క నేతృత్వంలో భవనాలను పరిశీలించారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఎంపీ రేవంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి, విజయరామారావు, కొండేటి శ్రీధర్, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, కాంగ్రెస్ నేత మాడిపల్లి సత్యం ఉన్నారు. అయితే హస్తం సీనియర్​ నేత హనుమంతరావును పోలీసులు కొద్దిసేపటివరకు లోపలికి అనుమతించలేదు. దీనిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తర్వాత అనుమతించారు. సచివాలయం నూతనంగా నిర్మించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని కాంగ్రెస్​ శ్రేణులు వ్యతిరేకిస్తున్నాయి. భవనాలు బాగుంటే కొత్తవి అవసరం లేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. సెక్రటేరియట్​ను పూర్తిగా పరిశీలించిన అనంతరం తమ వైఖరిని వెల్లడించనున్నారు కాంగ్రెస్​ నేతలు.

ఇదీ చూడండి : ప్రారంభమైన గ్రూప్​-2 మౌఖిక పరీక్షలు

Last Updated : Jul 1, 2019, 12:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.