ETV Bharat / state

ట్యాంక్​బండ్​ వద్ద కాంగ్రెస్​ నేతల కొవ్వొత్తుల ప్రదర్శన.. అరెస్ట్​ - congress leaders arrest at tankbund

ఉత్తర్​ప్రదేశ్​లో రాహుల్​గాంధీ పట్ల పోలీసుల వైఖరికి వ్యతిరేకంగా ట్యాంక్​బండ్​ వద్ద కాంగ్రెస్​ నేతలు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. పోలీసులు నేతలను అడ్డుకుని.. పోలీస్​ స్టేషన్​కు తరలించారు. ఈ సందర్భంగా పోలీసుల తీరుపై నేతలు తీవ్రంగా మండిపడ్డారు.

Congress leaders protest at Tank Bund.. leaders Arrest
ట్యాంక్​బండ్​ వద్ద కాంగ్రెస్​ నేతల కొవ్వొత్తుల ప్రదర్శన.. అరెస్ట్​
author img

By

Published : Oct 1, 2020, 9:10 PM IST

ఉత్తర్​ప్రదేశ్​లో దళిత బాలికపై సామూహిక అత్యాచారం, హత్య ఘటన, రాహుల్​గాంధీ పట్ల పోలీసుల వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్​ ఆధ్వర్యంలో ట్యాంక్​ బండ్​పై ఉన్న​ అంబేడ్క్​ర్ విగ్రహం వద్ద కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్​రెడ్డి, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు అంజన్​కుమార్ యాదవ్, పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ కార్యదర్శి బోసు రాజు, మర్రి శశిధర్ రెడ్డి, నగర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు ప్రదర్శనలో పాల్గొన్నారు.

ప్రదర్శన చేపట్టిన కాంగ్రెస్​ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఫలితంగా పోలీసులు, నాయకులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. అనంతరం పోలీసులు నేతలను అరెస్ట్​ చేసి స్టేషన్​కు తరలించారు. ఈ క్రమంలో ఉత్తర్​ప్రదేశ్ ప్రభుత్వానికి, భాజపాకు వ్యతిరేకంగా కాంగ్రెస్​ నేతలు పెద్దఎత్తున నినాదాలు చేశారు.

Congress leaders protest at Tank Bund.. leaders Arrest
ట్యాంక్​బండ్​ వద్ద కాంగ్రెస్​ నేతల కొవ్వొత్తుల ప్రదర్శన.. అరెస్ట్​

ఇదీ చూడండి: రాహుల్​ గాంధీపై దాడికి ప్రతిఘటన తప్పదు: ఉత్తమ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.