యూపీలో రాహుల్, ప్రియాంక అరెస్ట్‌ను నిరసిస్తూ హైదరాబాద్ నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయ ముట్టడికి యూత్ కాంగ్రెస్ నాయకులు ప్రయత్నించారు. దీంతో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్, ఆయన అనుచరులు తొమ్మిదిమందిపై అబిడ్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.
అనిల్ కుమార్ యాదవ్ తన అనుచరులతో భాజపా కార్యాలయ ముట్టడికి రావడంతో మొదట భాజపా నాయకులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తతకు దారితీయడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసి ఠాణాకు తరలించారు.