ETV Bharat / state

'రెవెన్యూ చట్టాన్ని మార్చకపోతే పేదలకు ఆకలిచావులు తప్పవు'

author img

By

Published : Sep 4, 2020, 3:29 PM IST

తెలంగాణ ప్రభుత్వం అమలు చేయనున్న రెవెన్యూ చట్టంలో పలు మార్పులు తీసుకురావాలని కాంగ్రెస్​ సీనియర్​ నేత వీహెచ్​ హైదరాబాద్​లో డిమాండ్​ చేశారు. అలాగే ఎన్నో మంచి పనులు చేసిన పీవీ నర్సింహారావుకు శతజయంతి ఉత్సవాల నిర్వహణపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

congress leader vh about new revenue act in telangana
'రెవెన్యూ చట్టాన్ని మార్చకపోతే పేదలకు ఆకలిచావులు తప్పవు'

రాష్ట్ర ప్రభుత్వం తీసుకురానున్న రెవెన్యూ చట్టంలో సమూల మార్పులు తీసుకురావాలని.. లేకపోతే పేదవారికి ఆకలి చావులు తప్పవని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు హైదరాబాద్​లో ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో రెవెన్యూ చట్టంపై సుదీర్ఘంగా చర్చ జరిగిన తర్వాత అందరికీ మేలు జరిగేలా అమలు చేసే రీతిలో చట్టం తీసుకురావాలని వీహెచ్ విజ్ఞప్తి చేశారు.

ల్యాండ్​ సీలింగ్​ చట్టం తీసుకురావడంలో పీవీ నర్సింహారావు కీలకపాత్ర పోషించారని కొనియాడారు. పీవీ శతజయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఆయన విగ్రహాలు ఏర్పాటు చేయాలని భావించడం సంతోషకరమని వీహెచ్​ అన్నారు. భూ సంస్కరణలు అమలు చేయడం, ఆయన సొంత భూమిని పేదలకు పంచిపెట్టడం లాంటి ఎన్నో మంచి పనులు చేసిన పీవీ నర్సింహారావుకు భారత రత్న ఇవ్వడంతో తప్పులేదని వీహెచ్​ అభిప్రాయపడ్డారు. ఈ విషయంపై రాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ కూడా రాసినట్లు పేర్కొన్నారు.

ఇవీచూడండి: ఈఎస్​ఐ కేసు: దేవికారాణితోపాటు మరో ఎనిమిది మంది అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.