ETV Bharat / state

'రాజకీయాల్లో గెలవడానికి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చాలా అవసరం' - Uttam Kumar Reddy

Congress review meeting on jodo yatra: హైదరాబాద్​ గాంధీభవన్‌ ప్రాంగణంలోని ప్రకాశం హాల్​లో హాథ్ సే హాథ్‌ జోడో అభియాన్​పై కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో అదానీ వ్యవహారం, జిల్లాల వారీగా హాథ్ సే హాథ్‌ జోడో అభియాన్ కార్యక్రమాల తీరుపై సమీక్షించారు.

కాంగ్రెస్ పార్టీ
కాంగ్రెస్ పార్టీ
author img

By

Published : Mar 4, 2023, 4:35 PM IST

Updated : Mar 4, 2023, 4:55 PM IST

Congress review meeting on jodo yatra: అదానీ వ్యవహారంపై జాయింట్ పార్లమెంట్‌ కమిటీని ఏర్పాటు చేయాలని ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రధాని నరేంద్రమోదీ అదానీ కంపెనీలకు లాభం చేకూర్చి.. బీజేపీకి ఎలక్టోరల్‌ బాండ్ల ద్వారా లబ్ది చేకూర్చారని ఉత్తమ్ ఆరోపించారు. గాంధీభవన్‌ ప్రాంగణంలోని ప్రకాశం హాల్లో హాథ్ సే హాథ్‌ జోడో అభియాన్​పై కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొని మాట్లాడారు.

సమావేశంలో ఏఐసీసీ ఇంఛార్జీ మాణిక్​రావు ఠాక్రే, జోడో యాత్ర ఇంఛార్జీ గిరీష్ చోడెంకర్, ఏఐసీసీ కార్యదర్శులు నదీమ్ జావిద్, రోహిత్ చౌదరి, చిన్నారెడ్డి తదితర సీనియర్ నేతలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో జిల్లాల వారీగా హాథ్ సే హాథ్‌ జోడో అభియాన్ కార్యక్రమాల తీరుపై సమీక్షించారు. భారతదేశం సెక్యులర్ దేశంగా ఉండాలని కోరుకుంటుందని.. బీజేపీ మాత్రం దేశాన్ని మతపరంగా విభజించి రాజకీయ లబ్ది పొందుతుందని ఉత్తమ్‌కుమార్ రెడ్డి మండిపడ్డారు.

''అదానీ వ్యవహారంపై జాయింట్ పార్లమెంట్‌ కమిటీని ఏర్పాటు చేయాలి. భారత ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అదానీ కంపెనీలకు లాభం చేకూర్చి బీజేపీకి ఎలక్టోరల్‌ బాండ్ల ద్వారా లబ్ది చేకూర్చారు. భారతదేశం సెక్యులర్ దేశంగా ఉండాలని కోరుకుంటుంది. కానీ బీజేపీ మాత్రం దేశాన్ని మతపరంగా విభజించి రాజకీయ లబ్ది పొందుతోంది.''-ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఎంపీ

తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు కాలం చెల్లిపోయిందని.. వీరిని ఇప్పుడు ప్రజలు నమ్మే స్థితిలో లేరని పీసీసీ మాజీ చీఫ్‌ వి.హనుమంతరావు విమర్శించారు. రాజకీయాల్లో గెలవడానికి డోర్ టు డోర్ క్యాంపెయిన్ ఉపయోగపడుతుందని తెలిపారు. పార్టీలో నేతలు గొడవపడితే కార్యకర్తలే కొడతారని అన్నారు. ప్రజలు కాంగ్రెస్‌కు అధికారం ఇవ్వడానికి సిద్దంగా ఉన్నారని.. నేతలు కొంచెం కష్టపడితే చాలునని వీహెచ్ అభిప్రాయపడ్డారు.

''తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు కాలం చెల్లిపోయింది. వీరిని ఇప్పుడు ప్రజలు నమ్మే స్థితిలో లేరు. తెలంగాణను ఇచ్చిన సోనియాగాంధీకి అధికారం కట్టబెట్టడానికి ప్రజలు సుముఖంగా ఉన్నారు. రాజకీయాల్లో గెలవడానికి డోర్ టు డోర్ క్యాంపెయిన్ ఉపయోగపడుతుంది. పార్టీలో నేతలు గొడవపడితే కార్యకర్తలే కొడతారు. ప్రజలు కాంగ్రెస్‌కు అధికారం ఇవ్వడానికి సిద్దంగా ఉన్నారు. నేతలు అందరూ సమైక్యంగా ఉండి కొంచెం కష్టపడితే చాలు విజయం సాధించవచ్చు.''-వి.హనుమంతరావు, పీసీసీ మాజీ చీఫ్‌

ఇవీ చదవండి:

Last Updated : Mar 4, 2023, 4:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.