ETV Bharat / state

ప్రజాదర్బార్‌తో ప్రజల సమస్యల పరిష్కరాన్ని పూర్తిగా మార్చేశాం : పొన్నం ప్రభాకర్​ - పొన్నం ప్రభాకర్​ కేసీఆర్​ పరామర్శ న్యూస్​

Congress Implemented Two Guarantees And Kept Our Word : ఎన్నికల్లో కాంగ్రెస్​ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో రెండు హామీలను అమలు చేసి మాట నిలబెట్టుకున్నామని పొన్నం తెలిపారు. మిగతా హామీలను రాబోయే వంద రోజుల్లో అమలు చేస్తామన్నారు. ప్రజా దర్బార్​ ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కరానికి కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని జిల్లాలకు విస్తరిస్తామని వివరించారు. ఆర్థిక పరిస్థితులపై తర్వలో శ్వేతపత్రం విడుదల చేస్తామని ప్రకటించారు. అనంతరం యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కేసీఆర్​ను పొన్నం ప్రభాకర్​ పరామర్శించారు.

Ponnam Prabhakar Visits KCR At Yashoda Hospital
Ponnam Said PrajaDarbar Program Extended Districts
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 10, 2023, 4:26 PM IST

Updated : Dec 10, 2023, 4:45 PM IST

Congress Implemented Two Guarantees And Kept Our Word : ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ రెండు గ్యారంటీలకు శ్రీకారం చుట్టామని ఇదే ఒరవడిలో మిగతా వాటిని అమలుచేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్‌(Ponnam Prabhakar) అన్నారు. అందరికంటే ప్రాధాన్యత కల్గిన మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం హామీని అమలు చేశాం. 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలను ప్రజాదర్బార్‌(Praja Darbar) ద్వారా తెలుసుకుంటామని తెలిపారు. కేసీఆర్ పాలనలో సమస్యలు చెప్పుకునే పరిస్థితి లేకుండా పోయిందన్న మంత్రి, ఆ పరిస్థితిని ప్రజాదర్బార్‌తో పూర్తిగా మార్చేశామని స్పష్టం చేశారు.

రెండో రోజు అదే ఉత్సాహం - ప్రజాదర్బార్​కు విశేష స్పందన

Ponnam Said PrajaDarbar Program Extended Districts : ప్రజా దర్బార్​ కార్యక్రమాన్ని జిల్లాలకు విస్తరిస్తామని పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. ప్రజా సమస్కలను పరిష్కరించడం కోసం మరింత ప్రాధాన్యం ఇస్తామన్నారు. మాజీ మంత్రులు అప్పుడే కాంగ్రెస్​ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం విడ్డూరంగా ఉందన్నారు. గత తొమ్మిదిన్నర సంవత్సరాలలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై శాఖలవారీగా శ్వేతపత్రం విడుదల చేస్తామని పొన్నం తెలిపారు. శ్వేతపత్రం ద్వారా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రజలకు వివరిస్తామని.. ప్రజలకిచ్చిన హామీలను వెనక్కి తగ్గకుండా పరిష్కరిస్తామని ప్రకటించారు.

Ponnam Prabhakar Visits KCR At Yashoda Hospital : పొన్నం ప్రభాకర్ ఇవాళ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్​ను పరామర్శించారు. బీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్​(Ex CM KCR) ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఆయన ప్రస్తుతం హైదరాబాద్​ యశోదా ఆసుపత్రిలో(Yashoda Hospital) చికిత్స పొందుతున్నారు. ఇవాళ యశోద ఆసుపత్రికి వెళ్లి కేసీఆర్​ను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్​ పరామర్శించారు. కేటీఆర్​, హరీశ్​రావు, దుబ్బాక శాసన సభ్యుడు ప్రభాకర్​ను కలిసి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

కేసీఆర్​ యోగక్షేమాలు అడిగి, వారిని తొందరగా కోలుకొవాలని కోరానన్నారు. వారి ఆరోగ్యం నిలకడగా ఉందని కేసీఆర్​ చెప్పారన్నారు. ఇందులో ఎటువంటి రాజకీయ కోణం లేదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి కూడా ఇవాళ మధ్యాహ్నం కేసీఆర్​ను పరామర్శించారు. రేవంత్​ వెంట మంత్రి సీతక్క, కాంగ్రెస్​ నేత షబ్బీర్​ అలీ ఉన్నారు. ఆయన త్వరగా కోలుకొని అసెంబ్లీకి రావాలని కోరుతున్నట్లు రేవంత్ తెలిపారు.

"కేసీఆర్​ను పరామర్శించి ఆయన యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నా. కేసీఆర్​ తొందరగా కోలుకొవాలని కోరుకుంటున్నాను. తన ఆరోగ్యం నిలకడగా ఉందని కేేసిఆర్ అన్నారు.​ రాజకీయాలలో ఉన్నప్పుడు ఇలాంటి పరామర్శలు సహజంగా జరుగుతుంటాయి. ఇందులో రాజకీయ కోణం లేదు."- పొన్నం ప్రభాకర్​, రవాణా శాఖ మంత్రి

ప్రజాదర్బార్‌తో ప్రజల సమస్యల పరిష్కరాన్ని పూర్తిగా మార్చేశాం : పొన్నం ప్రభాకర్

కావాలని కక్ష సాధించం కానీ - మా మొదటి ప్రాధాన్యత అదే : మంత్రి కోమటిరెడ్డి

తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్‌ పోటీ పడి డబ్బులు వెదజల్లాయి : కిషన్‌రెడ్డి

Last Updated : Dec 10, 2023, 4:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.