ETV Bharat / state

Jaggareddy: రేవంత్​పై జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలేంటి? కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్​కి కారణమేంటి? - telangana news

పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యల(Jagga Reddy And Revanth Reddy Issue)పై అధిష్ఠానం ఆగ్రహం వ్యక్తం చేసింది. జగ్గారెడ్డి(Sangareddy MLA Jagga Reddy) వ్యాఖ్యలు పార్టీకి నష్టం కలిగించేలా ఉన్నాయని అభిప్రాయ పడింది. జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఏఐసీసీ ఇన్​ఛార్జి మాణికం ఠాగూర్ ఆరా తీశారు.

Jagga Reddy And Revanth Reddy Issue
కాంగ్రెస్ అధిష్ఠానం ఆగ్రహం
author img

By

Published : Sep 25, 2021, 1:36 PM IST

Updated : Sep 25, 2021, 1:56 PM IST

పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి (Sangareddy MLA Jagga Reddy) చేసిన వ్యాఖ్యలపై... ఆ పార్టీ అధిష్ఠానం ఆగ్రహం వ్యక్తంచేసింది. ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీకి తీవ్ర నష్టం కలిగించేట్లు ఉన్నాయన్న అభిప్రాయంతో రాష్ట్ర వ్యవహారాలఇంఛార్జి మాణికం ఠాగూర్‌ (Manickam Tagore,congress in-charge of state affairs) రంగంలోకి దిగారు. ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు (AICC Secretary Bosuraju) ద్వారా ఠాగూర్ పూర్తిసమాచారం తెప్పించుకున్నారు.

అసలు శుక్రవారం జగ్గారెడ్డి ఏమన్నారంటే..

ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న ఒకే ఒక్క ఎమ్మెల్యేను. నాకు గజ్వేల్ సభలో మాట్లాడే అవకాశం ఎందుకు ఇవ్వలేదు. ఎవరి ఒత్తిడి మేరకు సభాధ్యక్షురాలు గీతారెడ్డి మాట్లాడటానికి నాకు అవకాశం ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీలో అసలు ఏమి జరుగుతుంది? ఒకరి నెత్తిన ఒకరు చెయ్యి పెట్టుకుంటే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా? పార్టీలో జరిగే అన్యాయాలను ప్రశ్నిస్తే సోషల్ మీడియా ద్వారా మా మీద విష ప్రచారం చేస్తున్నారు. పార్టీ మారాలంటే నాకు అడ్డు ఎవరు? ఎథిక్స్ కోసమే నేను కాంగ్రెస్ పార్టీలో పని చేస్తున్నాను. పార్టీలో నాలుగు సార్లు గెలిచిన ఎమ్మెల్యేలకు కూడా గౌరవం లేకుండా పోయింది. రాజకీయాల్లో హీరోయిజం పనిచేయదు. చిరంజీవి, రజనీకాంత్​ లాంటి వారే కనుమరుగయ్యారు. కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే గ్రామ స్థాయిలోకి వెళ్లి పని చేయాలి. ఈ రాష్ట్రంలో నాకు అభిమానులు ఉన్నారు. కావాలంటే పార్టీ మద్ధతు లేకుండా 2లక్షల మందితో సభ పెట్టి చూపిస్తా.

-ఎమ్మెల్యే జగ్గారెడ్డి

జగ్గారెడ్డి(Sangareddy MLA Jagga Reddy) ని పిలిపించి ప్రత్యేకంగా మాట్లాడాలని ఏఐసీసీ కార్యదర్శులను ఆదేశించారు. మధ్యాహ్నం జరిగే పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్ల సమావేశానికి రావల్సిందిగా జగ్గారెడ్డి(Sangareddy MLA Jagga Reddy) కి... పీసీసీ సమాచారమిచ్చింది. మధ్యాహ్నం హైదరాబాద్‌ రానున్న మాణికం ఠాగూర్... ఆ సమావేశంలో చర్చకొచ్చే అంశాలను వివరించనున్నారు. సాయంత్రం గాంధీభవన్‌లో జరిగే రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలోనూ జగ్గారెడ్డి(Sangareddy MLA Jagga Reddy) వ్యాఖ్యలపై చర్చ జరిగే అవకాశం ఉందని ఓ సీనియర్‌ నేత ఒకరు వెల్లడించారు.

ఇదీ చూడండి: 'రాజకీయాల్లో హీరోయిజం ప‌నిచేయ‌దు.. చిరంజీవి, రజనీకాంత్​లే కనుమరుగయ్యారు'

Last Updated : Sep 25, 2021, 1:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.